అగ్రపీఠంపై గిల్‌.. వైభవ్‌ భారీ జంప్‌

Published on Wed, 07/29/2026 - 14:58

తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్ల హవా కొనసాగింది. టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఏకంగా 230 స్థానాలు ఎగబాకి కెరీర్‌లోనే అత్యుత్తమమైన 48వ ర్యాంక్‌కు చేరుకోగా, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ మళ్లీ ప్రపంచ నంబర్-1 బ్యాటర్‌గా నిలిచాడు.

జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 151 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తాజా ర్యాంకింగ్స్‌లో భారీగా లాభపడ్డాడు. ప్రస్తుతం అతను 536 రేటింగ్ పాయింట్లతో 48వ స్థానంలో కొనసాగుతున్నాడు.

అదే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఇషాన్ కిషన్ 916 రేటింగ్ పాయింట్లతో టీ20 బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ (912 కెరీర్ బెస్ట్), విరాట్ కోహ్లీ (909 కెరీర్ బెస్ట్) వంటి భారత దిగ్గజాల కెరీర్ రేటింగ్‌లను కూడా అధిగమించాడు. 

టీ20 చరిత్రలో అత్యధిక బ్యాటింగ్ రేటింగ్‌ల జాబితాలో అభిషేక్ శర్మ (931), డేవిడ్ మలాన్ (919) తర్వాత ఇషాన్ కిషన్ (916 కెరీర్ బెస్ట్) మూడో స్థానంలో ఉన్నాడు.

ఇతర భారత ఆటగాళ్లలో తిలక్ వర్మ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఆరో ర్యాంక్‌కు చేరుకోగా, శ్రేయస్ అయ్యర్ ఏడు స్థానాలు ఎగబాకి 24వ స్థానంలో నిలిచాడు. బౌలర్ల జాబితాలో రవి బిష్ణోయ్ 31 స్థానాలు ఎగబాకి 41వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు.

మరోవైపు, వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో డారిల్ మిచెల్ అగ్రస్థానాన్ని కోల్పోవడంతో శుభ్‌మన్ గిల్ తిరిగి ప్రపంచ నంబర్-1 బ్యాటర్‌గా అవతరించాడు. ఈ ఏడాది జనవరి నుంచి అగ్రస్థానంలో కొనసాగిన మిచెల్‌ను వెనక్కి నెట్టి గిల్ మళ్లీ అగ్రపీఠాన్ని అధిరోహించాడు.
 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)