పూర్వ వైభవం కోసం!

Published on Mon, 06/08/2026 - 02:36

ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ చరిత్రలో అత్యంత నిలకడగా రాణిస్తున జట్లలో జర్మనీ జట్టు కచ్చితంగా ఉంటుంది. ఇప్పటి వరకు 22 సార్లు ప్రపంచకప్‌ జరగ్గా... అత్యధికసార్లు ఫైనల్‌ చేరుకున్న జట్టుగా జర్మనీకి పేరుంది. నాలుగుసార్లు (1954, 1974, 1990, 2014) విశ్వవిజేతగా నిలిచిన జర్మనీ జట్టు... మరో నాలుగుసార్లు ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా (1966, 1982, 1986, 2002) నిలిచింది. మరో నాలుగుసార్లు మూడో స్థానం (1934, 1970, 2006, 2010) సంపాదించింది. 2014లో బ్రెజిల్‌ ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్‌లో నాలుగోసారి చాంపియన్‌గా నిలిచిన జర్మనీ... ఆ తర్వాత అనూహ్యంగా వెనుకబడిపోయింది. 

పలువురు స్టార్‌ ఆటగాళ్లు రిటైర్‌ కావడం... వారి స్థానాలను భర్తీ చేసేవాళ్లు ఇంకా తయారు కాకపోవడం... వెరసి జర్మనీ జట్టు తొలిసారి వరుసగా రెండు ప్రపంచకప్‌లలో (2018, 2022) గ్రూప్‌ దశలోనే ఇంటిదారి పట్టింది. రెండేళ్ల క్రితం స్వదేశంలో జరిగిన ‘యూరో’ టోర్నీలో జర్మనీ క్వార్టర్‌ ఫైనల్లో చాంపియన్‌ స్పెయిన్‌ జట్టు చేతిలో ఓడిపోయింది. ఇక ప్రపంచకప్‌ క్వాలిఫయింగ్‌లో గ్రూప్‌ ‘ఎ’లో ఉన్న జర్మనీ 15 పాయింట్లతో టాపర్‌గా నిలిచి మెగా ఈవెంట్‌కు అర్హత సాధించింది. 

పూర్వ వైభవం కోసం తాపత్రయపడుతున్న జర్మనీ ఈసారి గ్రూప్‌ దశ సులువుగానే దాటే అవకాశం ఉంది. గ్రూప్‌ ‘ఇ’లో కురసావ్, ఐవరీకోస్ట్, ఈక్వెడార్‌ జట్లతో జర్మనీకి చోటు కల్పించారు. జర్మనీ తొలి మ్యాచ్‌ను జూన్‌ 14న కురసావ్‌తో, రెండో మ్యాచ్‌ను జూన్‌ 20న ఐవరీకోస్ట్‌తో, జూన్‌ 25న ఈక్వెడార్‌తో ఆడుతుంది. మిడ్‌ఫీల్డర్లు జమాల్‌ ముసియాలా, ఫ్లోరియన్‌ విట్జ్, లెనార్ట్‌ కార్ల్, కాయ్‌ హావెట్జ్‌లతోపాటు వెటరన్‌ గోల్‌కీపర్‌ మాన్యుయెల్‌ న్యూయెర్‌ ప్రదర్శనపై జర్మనీ ముందంజ వేసే ఆశలు ఆధారపడి ఉన్నాయి. జర్మనీ జట్టుకు నాకౌట్‌ దశ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో గత ప్రపంచకప్‌ రన్నరప్‌ ఫ్రాన్స్‌ ఎదురయ్యే అవకాశముంది. ఫ్రాన్స్‌ అడ్డంకిని అధిగమిస్తే జర్మనీ నుంచి అద్భుత ఫలితం ఆశించవచ్చు. – సాక్షి క్రీడావిభాగం  

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)