Breaking News

మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..

Published on Tue, 04/15/2025 - 11:35

అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నా.. క్రమశిక్షణారాహిత్యం వల్ల అధఃపాతాళానికి పడిపోయిన క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ (Vinod Kambli). శతక శతకాల ధీరుడు సచిన్‌ టెండుల్కర్‌ (Sachin Tendulkar) స్థాయికి చేరుకోగల సత్తా ఉన్న ఆటగాడిగా నీరాజనాలు అందుకున్న ఈ ముంబై బ్యాటర్‌ కెరీర్‌తో పాటు.. వ్యక్తిగత జీవితంలోనూ విఫలమయ్యాడు.

చెడు వ్యసనాల కారణంగా ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ చావు అంచులదాకా వెళ్లాడు. ఇటీవలి వినోద్‌ కాంబ్లీ పరిస్థితి మరింత దయనీయంగా మారగా.. 1983 వన్డే వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ జట్టులోని దిగ్గజాలు అతడికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్‌ సునిల్‌ గావస్కర్‌ కాంబ్లీకి ఇచ్చిన మాటను తాజాగా నిలబెట్టుకున్నారు. తన ఫౌండేషన్‌ చాంప్స్‌ (CHAMPS) ద్వారా అతడికి ఆర్థిక సహాయం అందించేందుకు రంగం సిద్ధం చేశారు. 

కాంబ్లీకి జీవితాంతం నెలకు..
టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రకారం.. గావస్కర్‌కు చెందిన ‘చాంప్స్‌’.. కాంబ్లీ బతికి ఉన్నంత కాలం నెల నెలా రూ. 30 వేల ఆర్థిక సాయం అందించనుంది. అంతేకాదు.. వైద్య అవసరాల నిమిత్తం ఏడాదికి మరో ముప్పై వేలు అదనంగా ఇవ్వనుంది.

కాగా కాంబ్లీ గురించి సునిల్‌ గావస్కర్‌ ఇండియా టుడేతో గతంలో మాట్లాడుతూ.. ‘‘1983 విన్నింగ్‌ జట్టు యువ ఆటగాళ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటుంది. వాళ్లు మాకు మనుమల లాంటి వాళ్లు. ఇంకొంత మంది వయసు దృష్ట్యా మాకు కుమారుల లాంటివారు.

మమకారం ఉండటం సహజం
అందుకే వారి పట్ల మాకు మమకారం ఉండటం సహజం. వారి పట్ల మా ప్రేమకు సాయం అనే పదం వాడటం సరికాదు. వినోద్‌ కాంబ్లీని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. అతడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. 

కష్టాల్లో ఉన్న క్రికెటర్లును చూసే నవ్వే రకం కాదు మేము. మాకు తోచిన రీతిలో వారికి సహాయపడటమే మా ముందున్న కర్తవ్యం’’ అని పేర్కొన్నారు. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే తన వంతు సాయం అందించడం విశేషం.

కాగా ఈ ఏడాది ఆరంభంలో అస్వస్థతకు గురైన వినోద్‌ కాంబ్లీ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. మూత్రనాళాల ఇన్‌ఫెక్షన్‌తో రెండు వారాల క్రితం కాంబ్లీ ఆస్పత్రిలో చేరగా... అతడి మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు తెలిపారు. 

ఈ క్రమంలో  రెండు వారాల చికిత్స అనంతరం కాంబ్లీ కోలుకుని జనవరిలో డిశ్చార్జ్‌ అయ్యాడు. ఈ క్రమంలో 1983 విన్నింగ్‌ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ కాంబ్లీని పరామర్శించాడు. ఇక గావస్కర్‌ సైతం కాంబ్లీ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశాడు.

టీమిండియా తరఫున
ఇక సచిన్‌ టెండ్కులర్‌కు బాల్య మిత్రుడైన వినోద్‌ కాంబ్లీ.. ముంబై తరఫున దేశవాళీ క్రికెట్‌ ఆడాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి 17 టెస్టులు, 104 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. తొమ్మిదేళ్ల పాటు(1991-2000) టీమిండియా తరఫున ఆడిన కాంబ్లీ.. టెస్టుల్లో 1084, వన్డేల్లో 2477 పరుగులు చేశాడు. 

అంతేకాదు.. టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యంత వేగంగా(14 ఇన్నింగ్స్‌లో) వెయ్యి పరుగుల మార్కు   క్రికెటర్‌గా ఇప్పటికీ తన రికార్డును కొనసాగిస్తున్నాడు. కాంబ్లీకి భార్య ఆండ్రియా హెవిట్‌, కుమారుడు, కూతురు ఉన్నారు. కాగా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మద్యం, పొగ తాగటం చాన్నాళ్ల క్రితమే మానేశానంటూ కాంబ్లీ ఇటీవలే వెల్లడించాడు.

చదవండి: MS Dhoni On POM Award: ఈ అవార్డు నాకెందుకు?.. అతడికి ఇవ్వాల్సింది

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)