అది నేను ఎప్పటికీ మర్చిపోలేను: గంభీర్‌

Published on Sat, 10/11/2025 - 19:05

గౌతమ్ గంభీర్‌.. టీమిండియా హెడ్‌కోచ్‌గా  వైట్ బాల్ క్రికెట్‌లో విజయవంతమైనప్పటికి.. సంప్రాదాయ ఫార్మాట్‌లో ఇంకా తన మార్క్ చూపించలేదు. టీ20 వరల్డ్‌కప్‌-2024 విజయం రాహుల్ ద్రవిడ్ వారుసుడిగా బాధ్యతలు చేపట్టిన గం‍భీర్‌కు ఆరంభం‍లోనే ఘోర పరాభావం ఎదురైంది.

సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ వైట్ వాష్‌కు గురైంది. 1933లో టీమిండియా స్వ‌దేశంలో తమ తొలి టెస్టు మ్యాచ్ ఆడినప్పటి నుంచి మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టులు ఉన్న సిరీస్‌లో వైట్ వాష్ అవ్వ‌డం ఇదే తొలిసారి.

ఈ ఘోర ఆ ప్ర‌తిష్ట‌ను భార‌త జ‌ట్టు గంభీర్ కోచింగ్‌లో మూట‌క‌ట్టుకోవ‌డంతో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ట్రోఫీలోనూ టీమిండియా దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3-1 తేడాతో భార‌త్ కోల్పోయింది.

దీంతో గంభీర్‌ను కోచ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించాల‌ని చాలా మంది మాజీలు సూచించారు. అయితే ఆ త‌ర్వాత భార‌త్ ఛాంపియ‌న్స్ ట్రోఫీ, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ స‌మం చేయ‌డంతో గంభీర్‌ను విమ‌ర్శించే వాళ్ల సంఖ్య కాస్త త‌గ్గింది. ఇటీవ‌లే ఆసియాక‌ప్‌ను కూడా భార‌త్ సొంతం చేసుకుంది.

ప్ర‌స్తుతం టీమిండియా స్వ‌దేశంలో వెస్టిండీస్‌తో త‌ల‌ప‌డుతోంది. ఇప్ప‌టికే తొలి టెస్టులో విజ‌యం సాధించిన గిల్ సేన.. ఢిల్లీ వేదిక‌గా జ‌రుగుతున్న‌  రెండో టెస్టులోనూ విజ‌యం దిశ‌గా సాగుతోంది. అయితే రెండో రోజు ఆట సంద‌ర్భంగా గౌత‌మ్ గంభీర్ అధికారిక బ్రాడ్‌క్రాస్ట‌ర్ స్టార్ స్పోర్ట్స్‌కు గౌతీ ఇంట‌ర్వ్యూ ఇచ్చాడు. ఈ సంద‌ర్భంగా కివీస్ సిరీస్ వైట్‌వాష్ కావ‌డంపై అత‌డు స్పందించాడు.

"న్యూజిలాండ్‌తో సిరీస్‌ను నేను ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. ఈ ఓట‌మిని మా బాయ్స్‌కు ఇప్ప‌టికి గుర్తు చేస్తూనే ఉంటాను. ఎందుకంటే కొన్నిసార్లు గతాన్ని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఏ జ‌ట్టును కూడా తేలిక‌గా తీసుకూడ‌ద‌ని నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. న్యూజిలాండ్‌ను ఈజీగా ఓడించగలమని అందరూ అనుకున్నారు.

కానీ ఊహించ‌ని ఫ‌లితం మాకు ఎదురైంది. నేను కోచ్‌గా ఉన్న లేక‌పోయినా న్యూజిలాండ్‌పై ఓట‌మిని డ్రెస్సింగ్ రూమ్ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. ఆ అనుభవం భ‌విష్య‌త్తులో జ‌ట్టుకు ఎంగత‌గానో ఉప‌యోగప‌డుతోంది" అని గంభీర్ పేర్కొన్నాడు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)