Breaking News

ఈజీ క్యాచ్‌ విడిచిపెట్టిన సంజూ.. గంభీర్‌ ఏమి చేశాడంటే?

Published on Sat, 02/01/2025 - 13:59

టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ సంజూ శాంస‌న్(Sanju Samson) పేలవ ఫామ్ కొన‌సాగుతోంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో నిరాశ‌ప‌రిచిన శాంస‌న్‌.. నాలుగో టీ20లో కూడా అదే తీరును క‌న‌బ‌రిచాడు. కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి స‌కీబ్ మ‌హమూద్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. బ్యాటింగ్‌లోనే కాకుండా వికెట్ కీపింగ్‌లోనూ శాంస‌న్ నిరాశ‌ప‌రిచాడు.  ఒక సులభమైన క్యాచ్‌ను శాంస‌న్ జార‌విడిచాడు.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 19 ఓవ‌ర్ వేసిన హ‌ర్షిత్ రాణా మూడో బంతిని ఫుల్ అండ్ ఔట్‌సైడ్ ఆఫ్ దిశ‌గా ఓవ‌ర్ట‌న్‌కు సంధించాడు. ఆ బంతిని ఓవ‌ర్ట‌న్ భారీ షాట్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని ఫైన్ లెగ్ వైపు గాల్లోకి లేచింది. క్యాచ్ కోసం వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, శాంస‌న్ ఇద్ద‌రూ ప‌రిగెత్తారు. అయితే సంజూ స‌మ‌యానికి చేరుకున్న‌ప్ప‌టికి సుల‌భ‌మైన క్యాచ్ అందుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. 

వాస్త‌వానికి చెప్పాలంటే వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి అందుకోవాల్సిన‌ క్యాచ్‌కు శాంస‌న్ మ‌ధ్య‌లోకి వెళ్లి జార‌విడ‌చాడు. దీంతో డౌగ‌ట్‌లో ఉన్న భార‌త హెడ్‌కోచ్ గౌతం గంభీర్(Goutham Gambhir) ఆసంతృప్తికి లోనయ్యాడు.  గంభీర్ ముఖం చేయి వేసుకుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.​ అయితే ఓవర్టన్‌​ క్యాచ్ అంత కాస్టలీగా మారలేదు. ఆ తర్వాతి  ఓవర్‌లనే ఓవర్టన్ ఔటయ్యాడు.

సిరీస్ భారత్ సొంతం..
ఇక ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 15 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలూండగానే ఐదు టీ20ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్​ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

భారత టాపార్డర్‌ విఫలమైనప్పటికి హార్దిక్ పాండ్యా( 30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53), శివమ్ దూబే(34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53), రింకూ సింగ్‌(30) రాణించారు. అనంత‌రం ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. భార‌త బౌల‌ర్ల‌లో కంక‌ష‌న్ స‌బ్‌స్ట్యూట్‌గా వ‌చ్చిన హ‌ర్షిత్ రాణా(Harshit Rana) మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, ర‌వి బిష్ణోయ్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. కాగా ఈ మ్యాచ్‌లో హర్షిత్‌ రాణా కంకషన్‌ సబ్‌గా రావడం కాస్త వివాదస్పదమైంది.
చదవండి: Suryakumar Yadav: వారిద్దరి వల్లే గెలిచాము.. కానీ అది మాత్రం ఊహించలేదు

 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)