Breaking News

సోషల్‌ మీడియా పోస్ట్‌తో.. రూ. 14 కోట్ల జాబ్ పోయింది

Published on Tue, 05/20/2025 - 16:08

లండన్‌: ఇంగ్లండ్‌ మాజీ ఫుట్‌బాల్‌ ఆటగాడు, కామెంటేటర్‌ గ్యారీ లినేకర్‌ (Gary Lineker) బీబీసీ వ్యాఖ్యాత స్థానం నుంచి వైదొలగనున్నాడు. సామాజిక మాధ్యమాల్లో జియోనిజానికి సంబంధించిన పోస్ట్‌ పెట్టిన కారణంగా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న గ్యారీ... ఇప్పుడు వ్యాఖ్యాతగా తప్పుకోనున్నాడు. మీడియా సెలబ్రిటీగా మంచి పేరున్న 64 ఏళ్ల లినేకర్‌... అత్యధిక పారితోషికం అందుకుంటున్న బ్రిటిష్‌ జాతీయ ప్రసారకుడిగా ఉన్నాడు. బీబీసీలో వ్యాఖ్యాతగా అతడు ఏడాదికి దాదాపు 1.7 మిలియన్ల అమెరికా డాలర్లు (రూ. 14 కోట్ల 52 లక్షలు) ప్రతిఫలంగా పొందుతున్నాడు.

‘జియోనిజం రెండు నిమిషాల్లో వివరించొచ్చు’ అనే క్యాప్షన్‌తో కూడిన ఎలుక చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో లినేకర్‌పై విమర్శలు గుప్పుమన్నాయి. యూదు వ్యతిరేక భావజాలం కలిగిన ఇలాంటి పోస్టు పెట్టినందుకు లినేకర్‌ ఇప్పటికే బహిరంగ క్షమాపణలు చెప్పినప్పటికీ... బీబీసీ గౌరవ మర్యాదలకు భంగం కలిగించినందుకు సోషల్‌ మీడియా పాలసీ (Social Media Policy) ప్రకారం అతడిపై యాజమాన్యం చర్యలు తీసుకుంది. 

ఇంగ్లండ్‌ జాతీయ జట్టు తరఫున 80 మ్యాచ్‌లాడిన లినేకర్‌... 48 గోల్స్‌ చేశాడు. 1986 ప్రపంచకప్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాడిగా నిలిచాడు.

చ‌ద‌వండి: భారత టాప్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాపై గ‌గ‌న్ నారంగ్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)