Breaking News

ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు పాక్‌‌కు ఊహించని షాక్‌..!

Published on Mon, 10/28/2024 - 09:03

ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు పాకిస్తాన్‌ జట్టుకు ఊహించని షాక్‌ తగలనున్నట్లు తెలుస్తుంది. ఆ జట్టు హెడ్‌ కోచ్‌ పదవి(పరిమిత ఓవర్లు) నుంచి గ్యారీ కిర్‌స్టన్‌ తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ.. ఈ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. 

త్వరలో పాక్‌ పరిమిత ఓవర్ల జట్లు ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనలకు వెళ్లనుండగా.. కిర్‌స్టన్‌ జట్లతో పాటు ఆయా దేశాలకు వెళ్లడం లేదని తెలుస్తుంది. కిర్‌స్టన్‌ పాక్‌ హెడ్‌ కోచ్‌ పదవి నుంచి వైదొలగడానికి ఆటగాళ్లతో ఏర్పడిన విభేదాలు కారణమని సమాచారం. మరోవైపు కిర్‌స్టన్‌ పాక్‌ హై పెర్ఫార్మెన్‌ కోచ్‌గా డేవిడ్‌ రీడ్‌ను నియమించాలని పాక్‌ క్రికెట్‌ బోర్డును కోరగా, అందుకు పీసీబీ ఒప్పుకోలేదని తెలుస్తుంది. కిర్‌స్టన్‌ వైదొలగడానికి ఇదీ ఒక కారణమని సమాచారం. 

కిర్‌స్టన్‌ పాక్‌ పరిమిత ఓవర్ల హెడ్‌ కోచ్‌గా ఎంపికై కేవలం నాలుగు నెలలే అవుతుంది. ఈ లోపే అతనికి బోర్డుకు మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడినట్లు తెలుస్తుంది. మరో నాలుగు నెలల్లో పాక్‌లోనే ఛాంపియన్స్‌ ట్రోఫీ జరుగనుంది. ఈ లోపు కిర్‌స్టన్‌ నిజంగా హెడ్‌ కోచ్‌ పదవి నుంచి వైదొలిగితే అది పాక్‌ జట్టుకు నష్టం వాటిల్లేలా చేస్తుంది. ఒకవేళ కిర్‌స్టన్‌ పాక్‌ హెడ్‌ కోచ్‌ పదవి నుంచి వైదొలిగితే అతని స్థానా​న్ని టెస్ట్‌ జట్టు హెడ్‌ కోచ్‌ జేసన్‌ గిల్లెస్సీ లేదా జతీయ సెలెక్టర్‌ ఆకిబ్‌ జావిద్‌ భర్తీ చేసే అవకాశం ఉంది.

కాగా, త్వరలో ఆస్ట్రేలియా, జింబాబ్వేలతో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం పాక్‌ జట్లను నిన్న ప్రకటించారు. పాక్‌ క్రికెట్‌ బోర్డు తమ పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్‌గా మహ్మద్‌ రిజ్వాన్‌ను నియమించింది. పాక్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి బాబార్‌ ఆజమ్‌ ఇటీవలే తప్పుకున్నాడు. 

 

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)