బౌలింగ్‌ కోచ్‌గా మోర్కెల్‌ కావాలి.. ఎటూ తేల్చని బీసీసీఐ

Published on Fri, 07/12/2024 - 15:07

సహాయ సిబ్బందిని ఎంపిక చేసుకునే విషయంలో పూర్తి స్వేచ్ఛ కావాలని బీసీసీఐతో ముందే ఒప్పందం చేసుకున్న టీమిండియా హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌.. తాజాగా తన సపోర్టింగ్‌ స్టాఫ్‌ లిస్ట్‌లో కొత్త పేరును చేర్చాడు. సహాయ కోచ్‌లుగా అభిషేక్‌ నాయర్‌, టెన్‌ డస్కటే.. ఫీల్డింగ్‌ కోచ్‌గా జాంటీ రోడ్స్‌ పేర్లను ఇదివరకే ప్రతిపాదించిన గంభీర్‌.. బౌలింగ్‌ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ మోర్నీ మోర్కెల్‌ పేరును కొత్తగా తెరపైకి తెచ్చాడు. 

మోర్నీ మోర్కెల్‌ గతంలో గంభీర్‌తో కలిసి లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఫ్రాంచైజీకి పని చేశాడు. ఈ సాన్నిహిత్యంతోనే గంభీర్‌ మోర్నీ పేరును ప్రతిపాదించి ఉండవచ్చు. మోర్నీకి ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా మంచి ట్రాక్‌ రికార్డు ఉంది.

ఇదిలా ఉంటే, గంభీర్‌ ఎంపికల విషయంలో బీసీసీఐ ఓ మెలిక పెట్టినట్లు తెలుస్తుంది. సహాయ సిబ్బందిగా భారతీయులనే ఎంపిక చేసుకోవాలని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గంభీర్‌ ముగ్గురు విదేశీ కోచ్‌ల పేర్లను ప్రతిపాదించడం చర్చనీయాంశంగా మారింది. బీసీసీఐ.. గంభీర్‌ ప్రతిపాదనలను ఒప్పుకుంటుందో లేదో మరి కొద్ది రోజుల్లో తేలిపోనుంది.

గంభీర్‌ ప్రతిపాదనలను అటుంచితే.. టీమిండియా ఫీల్డింగ్‌ కోచ్‌గా టి దిలీప్‌ను కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. బౌలింగ్‌ కోచ్‌గా జహీర్‌ ఖాన్‌ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. మోర్నీ కాకపోతే బౌలింగ్‌ కోచ్‌లుగా లక్షీపతి బాలాజీ, వినయ్‌ కుమార్‌లలో ఎవరో ఒకరిని ఎంపిక చేయాలని గంభీర్‌ కోరినట్లు తెలుస్తుంది. గంభీర్‌ ప్రతిపాదనలు.. సొంత ఛాయిసెస్‌ నడుమ బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)