Breaking News

‘గంభీర్‌ ఒక మోసగాడు.. గెలిస్తే క్రెడిట్‌ నాదే అంటాడు.. కానీ’

Published on Thu, 01/09/2025 - 13:21

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌(Gautam Gambhir)పై భారత మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారి(Manoj Tiwary) ఘాటు విమర్శలు చేశాడు. గంభీర్‌ను మోసకారిగా అభివర్ణిస్తూ.. అతడొక కపట మనస్తత్వం కలిగిన వ్యక్తి అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టు గెలిచినపుడు విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు మాత్రమే ముందుంటాడని.. ఓడితే మాత్రం ఏవో సాకులు చెబుతాడంటూ మండిపడ్డాడు.

పట్టుబట్టి మరీ కోచింగ్‌ స్టాఫ్‌లోకి తీసుకున్నాడు
అసలు గంభీర్‌ నాయకత్వంలోని కోచింగ్‌ సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని మనోజ్‌ తివారి విమర్శించాడు. కాగా రాహుల్‌ ద్రవిడ్‌(Rahul Dravid) స్థానంలో గతేడాది గంభీర్‌ టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో తనతో కలిసి పనిచేసిన అభిషేక్‌ నాయర్‌, మోర్నీ మోర్కెల్‌, ర్యాన్‌ టెన్‌ డష్కటేలను పట్టుబట్టి మరీ కోచింగ్‌ స్టాఫ్‌లో చేర్చుకున్నాడు.

ఘోర వైఫల్యాలు
అయితే, గంభీర్‌ హయాంలో టీమిండియా ఇప్పటి వరకు పెద్దగా సాధించిందేమీ లేకపోగా.. ఘోర వైఫల్యాలు చవిచూసింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ 3-0తో వైట్‌వాష్‌కు గురికావడంతో పాటు.. పదేళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రేలియాకు బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీని కోల్పోయింది. ఆసీస్‌ పర్యనటలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో 3-1తో ఓడి ఈ పరాభవాన్ని మూటగట్టుకుంది.

ఈ నేపథ్యంలో మనోజ్‌ తివారి మాట్లాడుతూ.. ‘‘గౌతం గంభీర్‌ ఒక మోసకారి. అతడు చెప్పేదొకటి. చేసేదొకటి. భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోచ్ అభిషేక్‌ నాయర్‌.. ఇద్దరూ ముంబైవాళ్లే. ఓటముల సమయంలో రోహిత్‌ను ముందుకు నెట్టేలా ప్లాన్‌ చేశారు. అసలు జట్టుకు బౌలింగ్‌ కోచ్‌ వల్ల ఏం ప్రయోజనం కలిగింది?

వారి వల్ల ఏం ఉపయోగం?
ప్రధాన కోచ్‌ ఏది చెబితే దానికి తలాడించడం తప్ప బౌలింగ్‌ కోచ్‌ ఏం చేస్తాడు? మోర్నీ మోర్కెల్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌ నుంచి వచ్చాడు. ఇక అభిషేక్‌ నాయర్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు చెందినవాడు. ఈ ఇద్దరూ గంభీర్‌తో కలిసి పనిచేశారు. గంభీర్‌ ఇప్పుడు భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌. వీరు అతడి అసిస్టెంట్లు. గంభీర్‌ హాయిగా తనదైన కంఫర్ట్‌జోన్‌లో ఉన్నాడు’’ అని న్యూస్‌18 బంగ్లా చానెల్‌తో పేర్కొన్నాడు.

సమన్వయం లేదు
అదే విధంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో గంభీర్‌కు సమన్వయం లోపించిందన్న మనోజ్‌ తివారి.. వారిద్దరు ఇక ముందు కలిసి పనిచేస్తారా? అనే సందేహం వ్యక్తం చేశాడు. ‘‘రోహిత్‌ ప్రపంచ కప్‌ గెలిచిన కెప్టెన్‌. మరోవైపు.. గంభీర్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు కెప్టెన్‌గా, మెంటార్‌గా టైటిల్స్‌ అందించాడు. నాకు తెలిసి వీరిద్దరికి ఏకాభిప్రాయం కుదరడం లేదు’’ అని మనోజ్‌ తివారి పేర్కొన్నాడు.

క్రెడిట్‌ అంతా తనకే అంటాడు
కాగా ఐపీఎల్‌-2024లో గంభీర్‌ మెంటార్‌గా వ్యవహరించిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. అతడికి కోచ్‌గా పనిచేసిన అనుభవం లేకపోయినా బీసీసీఐ ఏకంగా టీమిండియా హెడ్‌కోచ్‌గా పదవిని ఇచ్చింది. 

ఈ విషయం గురించి మనోజ్‌ తివారి ప్రస్తావిస్తూ..‘‘గంభీర్‌ ఒంటిచేత్తో ఎన్నడూ కోల్‌కతాకు టైటిల్‌ అందించలేదు. జాక్వెస్‌ కలిస్‌, సునిల్‌ నరైన్‌.. నేను.. ఇలా చాలా మంది సహకారం ఇందులో ఉంది. అయితే, క్రెడిట్‌ అంతా ఎవరు తీసుకున్నారో అందరికీ తెలుసు’’ అంటూ గంభీర్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించాడు.

చదవండి: ఆస్ట్రేలియాకు భారీ షాక్‌!.. చాంపియన్స్‌ ట్రోఫీకి కమిన్స్‌ దూరం?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)