‘సామ్సన్‌కు పూర్తిగా స్పష్టతనిచ్చాం’

Published on Thu, 07/09/2026 - 03:57

నాటింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో రెండో టి20  నుంచి సంజు సామ్సన్‌ను తప్పించడం తీవ్ర చర్చకు దారి తీసింది. టి20 ప్రపంచకప్‌లో వరుసగా 97, 89, 89 స్కోర్లతో భారత్‌ను గెలిపించడంతో పాటు సామ్సన్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచాడు. అయితే ఐర్లాండ్‌తో తొలి రెండు మ్యాచ్‌లు, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో తొలి టి20లో అతను వరుసగా  5, 0, 1 స్కోర్లు మాత్రమే నమోదు చేశాడు. అయితే కేవలం మూడు మ్యాచ్‌లలో విఫలం కావడంతోనే ఒక అగ్రశ్రేణి బ్యాటర్‌ను పక్కన పెట్టడంతో మేనేజ్‌మెంట్‌పై విమర్శలు వచ్చాయి. దీనిపై మొదటిసారి హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ స్పందించాడు. 

ఈ విషయంలో తాను స్వయంగా సామ్సన్‌కు అన్ని అంశాలు వివరించానని అతను వెల్లడించాడు. ‘సంజు సామ్సన్‌కు ఈ విషయంలో ఎలాంటి స్పష్టతనివ్వాలో అదంతా చెప్పాం. ఇది ఒక ఆటగాడికి, హెడ్‌ కోచ్‌కు మధ్య జరిగిన సంభాషణ. కాబట్టి వాటి వివరాలు సహజంగానే మేం బయటకు చెప్పం. ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రపంచ కప్‌లో సామ్సన్‌ ఎంత అద్భుతంగా ఆడాడో మాకూ బాగా తెలుసు. అయితే కొన్ని సందర్భాల్లో ఆటగాళ్ల తాజా ఫామ్‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

అయినా ఈ సిరీస్‌లో అతను మళ్లీ ఆడలేడనే నిబంధన ఏమీ లేదు కదా. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్నింటికంటే ఫలితాలు ముఖ్యం. ఏ 11 మంది అత్యుత్తమ ఆటగాళ్ల బృందం మాకు ఫలితాలు అందిస్తుందనే నమ్ముతామో వారినే ఆడిస్తాం. భారత్‌ తరఫున ఆడగల హక్కును జట్టులోని ప్రతీ ఒక్కరు తమంతట తామే సంపాదించుకోవాలనే విషయాన్ని నేను గట్టిగా నమ్ముతాను’ అని గంభీర్‌ వివరించాడు. ఇంగ్లండ్‌తో మూడో టి20లో చిత్తుగా ఓడిన తర్వాత తమ పరాజయానికి కారణాలను కోచ్‌ విశ్లేషించాడు. 

టి20ల్లో భారత జట్టు సుదీర్ఘ కాలంగా ఆధిపత్యం ప్రదర్శించిన తర్వాత ఇప్పుడు జట్టు మారిందని, కుదురుకోవడానికి కొంత సమయం పడుతుందని హెడ్‌ కోచ్‌ అభిప్రాయ పడ్డాడు. ‘ఇంగ్లండ్‌లో పరిస్థితులను బట్టి ఆటను మార్చుకోవాల్సి అవసరం కచ్చితంగా ఉంది. అయితే ఇటీవల టీమ్‌లో పలు మార్పుచేర్పులు జరిగాయి. వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఆడిన టీమ్‌ నుంచి కొందరు మాత్రమే ఇక్కడున్నారు. కెప్టెన్ మారాడు, ఓపెనర్‌ మారాడు. పాండ్యా, బుమ్రా ఆడటం లేదు. కాబట్టి ఇంకా టీమ్‌ పూర్తిగా కుదురుకోలేదు. 

జట్టులోకి పలువురు ఆటగాళ్లు ఇంకా పూర్తి స్థాయిలో ఎదిగేందుకు సమయం పడుతుంది. మా ఆటగాళ్లంతా రిస్‌్కతో కూడిన క్రికెట్‌ ఆడుతున్నారు కాబట్టి ఇలాంటి ఫలితాలూ వస్తాయి. ప్రపంచకప్‌లోనూ మా టాపార్డర్‌ ఇదే తరహా దూకుడు ప్రదర్శించింది. అయితే అప్పుడు మిడిలార్డర్‌ నిలకడగా ఆడి ఆదుకుంది. ఈసారి అది కనిపించలేదు’ అని భారత మాజీ ప్లేయర్‌ వ్యాఖ్యానించాడు. నాలుగు మ్యాచ్‌లు ఓడినంత మాత్రం భారత్‌ చెత్త టీమ్‌గా మారిపోదని కూడా అతను అన్నాడు.   

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)