Breaking News

Gautam Gambhir: ‘నువ్వు గ్రౌండ్స్‌మన్‌వి మాత్రమే’

Published on Wed, 07/30/2025 - 04:24

లండన్‌: ఇంగ్లండ్‌తో ఐదో టెస్టుకు రెండు రోజుల ముందు భారత జట్టును మానసికంగా దెబ్బ తీసే ప్రయత్నం మొదలైంది. అయితే ఇది ఆటగాళ్ల నుంచి రాలేదు. చివరి టెస్టు జరిగే ఓవల్‌ పిచ్‌ క్యురేటర్‌ చేసిన ‘అతి’ మైదానంలో చర్చకు దారి తీసింది. భారత హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆగ్రహానికి ఇది కారణమైంది. మంగళవారం ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ కావడంతో కొందరు భారత ఆటగాళ్లతో పాటు కోచింగ్‌ బృందం ఓవల్‌ మైదానానికి వెళ్లింది. టెస్టుకు ఒకటి లేదా రెండు రోజుల ముందు ఇరు జట్ల కెప్టెన్ లేదా కోచ్‌లు పిచ్‌ను పరిశీలించడం, దానిపై ఒక అంచనాకు రావడం సాధారణ ఆనవాయితీ. 

గంభీర్‌ కూడా తన సహచర కోచింగ్‌ సిబ్బందితో పిచ్‌ వద్దకు వెళ్లాడు. అయితే క్యురేటర్‌ లీ ఫోర్టస్‌ బృందంలోని ఒక సభ్యుడు అక్కడికి వచ్చి పిచ్‌కు బాగా దగ్గరగా వెళ్లవద్దని, అక్కడి నుంచి 2.5 మీటర్ల దూరం ఉండాల్సిందిగా కోరాడు. ఇది గంభీర్‌కు కాస్త అసహనం తెప్పించింది. పిచ్‌ పాడు కాకుండా క్యురేటర్లు జాగ్రత్తలు చెప్పడం సహజమే అయినా ఒక జట్టు కోచ్‌ను నిలువరించడం ఎప్పుడూ జరగదు. మ్యాచ్‌ జరిగే ప్రధాన పిచ్‌కు బాగా దగ్గరగా భారత ఆటగాళ్లు పదే పదే రావడం క్యురేటర్‌కు ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం. 

అయితే ప్రాక్టీస్‌కు కేటాయించిన మూడు పిచ్‌లకు ఇది బాగా దగ్గరగా ఉందని, పూర్తిగా అటు వెళ్లకుండా ఉండటం సాధ్యం కాదని మన కోచింగ్‌ బృందం జవాబి చ్చినట్లు తెలిసింది. అయితే వివాదం అక్కడితో ముగిసిపోలేదు. భారత్‌కు చెందిన సహాయకుడు ఒకరు కూలింగ్‌ బాక్స్‌ను ఆటగాళ్ల ప్రాక్టీస్‌ నెట్స్‌ వద్దకు తీసుకెచ్చే ప్రయత్నం చేయగా, దీనిని కూడా క్యురేటర్‌ వారించాడు. దాంతో కోపం వచ్చిన గంభీర్‌ ఏదో మాట అనడం... ఇలా మాట్లాడవద్దని, మళ్లీ ఇలా చేస్తే ఐసీసీకి ఫిర్యాదు చేస్తానని క్యురేటర్‌ అన్నాడు. 

అంతే...ఏం చేసుకుంటావో చేసుకోమంటూ తనదైన శైలిలో తీవ్రంగా బదులిచ్చాడు. ‘మేం ఏం చేయాలో నువ్వు చెప్పనవసరం లేదు. మా బృందం ఏం చేయాలో కూడా నువ్వు చెప్పవద్దు. నీకు ఎలాంటి అధికారం లేదు. నువ్వు కేవలం గ్రౌండ్స్‌మన్‌వి మాత్రమే. అంతకు మించి ఏమీ కాదు. నీ పరిధిలో ఉండు. నువ్వు గ్రౌండ్స్‌మన్‌వి మాత్రమే’ అని గంభీర్‌ తీవ్రంగా జవాబిచ్చాడు. చివరకు బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ కలగజేసుకొని ఫోర్టిస్‌ను దూరంగా తీసుకెళ్లి పరిస్థితిని చక్కదిద్దాల్సి వచ్చి oది.    

  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)