Breaking News

వాంఖ‌డేలో భారత జట్టుకు స‌న్మానం.. ఫ్యాన్స్‌కు ఫ్రీ ఎంట్రీ

Published on Thu, 07/04/2024 - 15:19

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-4 విజేత‌గా నిలిచిన భార‌త జ‌ట్టు నాలుగు రోజుల త‌ర్వాత త‌మ సొంత గ‌డ్డ‌పై అడుగుపెట్టింది. గురువారం ఉద‌యం ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమాన‌శ్రాయంకు భార‌త జ‌ట్టుకు ఘ‌న స్వాగతం ల‌భించింది. 

ఎయిర్ పోర్ట్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు టీమిండియాకు నీరాజనం పలికారు. భారత ఆటగాళ్లు సైతం ఎయిర్ పోర్ట్ నుంచి హోటల్‌కు వెళ్తున్న దారిలో అదిరే స్టెప్పులతో అలరించారు.  అనంతరం రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. 

దాదాపు అరగంట పాటు క్రికెటర్లు, సహాయ సిబ్బంది మోదీతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఇక మోదీతో భేటి అనంతరం టీమిండియా ఆటగాళ్లు  ‍ప్రత్యేక విమానంలో ముంబైకు పయనమయ్యారు. సాయంత్రం 5 గంటలకు ముంబై నగర వీధుల్లో టీమిండియా విజయోత్సవ యాత్ర జరుగనుంది.

ఫ్యాన్స్‌కు ఫ్రీ ఎంట్రీ..
ఆ తర్వాత రాత్రి 7 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి మాజీ క్రికెటర్లతో పాటు బీసీసీఐ పెద్దలు హాజరకానున్నారు. ఈ క్ర‌మంలో ముంబై క్రికెట్ ఆసోషియేష‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 

ఈ స‌న్మాన వేడుక‌ను చూసేందుకు అభిమానుల‌కు ఫ్రీ ఎంట్రీ ఇవ్వాల‌ని ఎంసీఎ నిర్ణ‌యించుకుంది. ఈ విష‌యాన్ని గురువారం ఎంసీఎ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అదే విధంగా స్టేడియం వ‌ద్ద భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేసిన‌ట్లు ఎంసీఎ అధికారులు తెలిపారు. సాయంత్రం 4 గంట‌ల‌కు స్టేడియం గేట్లు ఓపెన్ చేయ‌నున్న‌ట్లు ఎంసీఏ వెల్ల‌డించింది.

వ‌ర్షం అంత‌రాయం..
ఇక ఈ కార్య‌క్ర‌మానికి వ‌ర్షం అంత‌రాయం క‌లిగించే ఛాన్స్ ఉంది. స‌న్మాన కార్య‌క్ర‌మం జ‌రిగే స‌మ‌యంలో వ‌ర్షం ప‌డే  అవ‌కాశాలు 90 శాతం ఉన్న‌ట్లు అక్క‌డ వాతవార‌ణ శాఖ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. కాగా ఈ వేడుక కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)