Breaking News

వినోద్‌ కాంబ్లీని కలిసిన సచిన్‌.. చేయి వదలకుండా బిగించడంతో.. ఆఖరికి

Published on Wed, 12/04/2024 - 10:54

ప్రముఖ క్రికెట్‌ కోచ్‌ రమాకాంత్‌ విఠల్‌ ఆచ్రేకర్‌ 92వ జయంతిని ముంబైలో ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ పార్క్‌లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ‘గురు’ ఆచ్రేకర్‌ మొమోరియల్‌ను సచిన్‌ ఆవిష్కరించారు.

స్నేహితుడితో కరచాలనం
ఇక ఈ కార్యక్రమంలో సచిన్‌ చిన్ననాటి స్నేహితుడు, మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ కూడా పాల్గొన్నాడు. అయితే, సచిన్‌ కంటే ముందే కాంబ్లీ వేదిక మీదకు చేరుకోగా.. సచిన్‌ వస్తూ  వస్తూ తన స్నేహితుడితో కరచాలనం చేశాడు.

చేయి వదిలేందుకు ఇష్టపడని కాంబ్లీ
అయితే, కాంబ్లీ మాత్రం సచిన్‌ చేతిని వదలకుండా గట్టిగా అలాగే పట్టుకున్నాడు. దీంతో పక్కనున్న వ్యక్తి కాంబ్లీ నుంచి అతడి చేతిని విడిచిపించడానికి కాస్త కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత సచిన్‌ తన కుర్చీ వద్దకు వెళ్లి కూర్చోగా.. కాంబ్లీ స్నేహితుడి వైపే చూస్తూ ఉండిపోయాడు.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాంబ్లీపై నెటిజన్ల సానుభూతి.. ఈ పరిస్థితికి కారణం ఎవరు?
ఈ నేపథ్యంలో వినోద్‌ కాంబ్లీ పరిస్థితిని చూసి నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. సచిన్‌ స్థాయికి చేరుకోగల సత్తా ఉన్నా చేజేతులా కెరీర్‌ నాశనం చేసుకుని.. ఇలాంటి దుస్థితికి చేరుకున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు. 

వ్యక్తిగతంగానూ క్రమశిక్షణ లోపించినందు వల్లే అతడి కెరీర్‌ అర్ధంతరంగా ముగిసిపోయిందన్న కాంబ్లీ సన్నిహిత వర్గాల మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ​కాగా కాంబ్లీ ప్రస్తుతం ఆరోగ్యపరంగా.. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

కాగా భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో 1993- 2000 మధ్య వినోద్‌ కాంబ్లీ 17 టెస్టులు, 104 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో 1084, 2477 రన్స్‌ చేశాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌. ఇక దేశీ టోర్నీలో 2004లో మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌ సందర్భంగా ముంబైకి చివరగా ఆడాడు కాంబ్లీ.

ఇదిలా ఉంటే.. 2013లో వినోద్‌ కాంబ్లీకి హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. కారులో వెళ్తున్న సమయంలో గుండెపోటు రాగా.. ఓ పోలీస్‌ అధికారి గమనించి సరైన సమయంలో ఆస్పత్రిలో చేర్చడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.

సెంచరీ సెంచరీల వీరుడిగా సచిన్‌
మరోవైపు.. సచిన్‌ టెండుల్కర్‌ భారత క్రికెట్‌కు మారుపేరుగా ఎదిగాడు. టీమిండియా తరఫున 664 మ్యాచ్‌లు ఆడి 34357 పరుగులు సాధించాడు. ఇప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక రన్స్‌ చేసిన క్రికెటర్‌గా సచిన్‌ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. 

అంతేకాదు.. ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లో వంద సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు కూడా సచినే. ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ‘భారత రత్న’తో సత్కరించింది. ఇక సచిన్‌, కాంబ్లీ ఇద్దరూ ఆచ్రేకర్‌(1932- 2019) శిష్యులే కావడం గమనార్హం.

చదవండి: WTC Final: న్యూజిలాండ్‌ అవకాశాలపై నీళ్లు చల్లిన ఐసీసీ
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)