Breaking News

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌-2025 విజేత ఫార్చూన్‌ బారిషల్‌

Published on Fri, 02/07/2025 - 21:28

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌-2025 ఎడిషన్‌ విజేతగా ఫార్చూన్‌ బారిషల్‌ నిలిచింది. ఇవాళ (ఫిబ్రవరి 7) జరిగిన ఫైనల్లో బారిషల్‌.. చిట్టగాంగ్‌ కింగ్స్‌పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చిట్టగాంగ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్లు ఖ్వాజా నఫే (66), పర్వేజ్‌ హొస్సేన్‌ ఎమోన్‌ (78 నాటౌట్‌) అర్ద సెంచరీలతో రాణించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించారు. ఆతర్వాత వచ్చిన గ్రహం క్లార్క్‌ (44) కూడా రాణించడంతో కింగ్స్‌ భారీ స్కోర్‌ చేసింది. బారిషల్‌ బౌలర్లలో మొహ‍మ్మద్‌ అలీ, ఎబాదత్‌ హొసేన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బారిషల్‌కు కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ (54), తౌహిద్‌ హృదోయ్‌ (320 శుభారంభాన్ని అందించారు. అనంతరం కైల్‌ మేయర్స్‌ (46) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి బారిషల్‌ను విజయానికి చేరువ చేశాడు. ఆఖర్లో రిషద్‌ హొసేన్‌ (18 నాటౌట్‌) రెండు సిక్సర్లు బాది బారిషల్‌కు విజయాన్ని ఖరారు చేశాడు. మరో మూడు బంతులు మిగిలుండగానే బారిషల్‌ విజయతీరాలకు చేరింది. కింగ్స్‌ బౌలర్లలో షోరిఫుల్‌ ఇస్లాం 4 వికెట్లు తీసి బారిషల్‌ను భయపెట్టాడు. నయీమ్‌ ఇస్లాం 2, బినుర ఫెర్నాండో ఓ వికెట్‌ పడగొట్టారు. ఫార్చూన్‌ బారిషల్‌ టైటిల్‌ సాధించడం వరుసగా ఇది రెండో సారి కావడం విశేషం.

 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు