Breaking News

Max Verstappen: విజేత వెర్‌స్టాపెన్‌ 

Published on Mon, 03/11/2024 - 07:38

Saudi Arabian Formula One Grand Prix  2024- జెద్దా: ఫార్ములావన్‌ తాజా సీజన్‌లో తన జోరు కొనసాగిస్తూ రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ వరుసగా రెండో రేసులోనూ టైటిల్‌ సాధించాడు. సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రిలో నిర్ణీత 50 ల్యాప్‌లను వెర్‌స్టాపెన్‌ అందరికంటే వేగంగా 1 గంట 20 నిమిషాల 43.273 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన వెర్‌స్టాపెన్‌ చివరిదాకా తన ఆధిక్యాన్ని కాపాడుకొని తన కెరీర్‌లో 56వ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. సీజన్‌ తొలి రేసు బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రిలోనూ వెర్‌స్టాపెన్‌ నెగ్గాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది.  

పోరాడి ఓడిన శ్రీజ 
సింగపూర్‌ స్మాష్‌ వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (డబ్ల్యూటీటీ) టోర్నీలో తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. ప్రపంచ మూడో ర్యాంకర్‌ వాంగ్‌ మాన్యు (చైనా)తో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 50వ ర్యాంకర్‌ శ్రీజ 6–11, 11–9, 5–11, 11–8, 8–11తో పోరాడి ఓడిపోయింది.

మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సుతీర్థ ముఖర్జీ 4–11, 11–7, 9–11, 11–9, 10–12తో జియోజిన్‌ యాంగ్‌ (చైనా) చేతిలో ఓటమి చవిచూసింది. పురుషుల సింగిల్స్‌లో శరత్‌ కమల్‌ క్వాలిఫయింగ్‌లో విజేతగా నిలిచి మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందాడు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)