న్యూజిలాండ్‌ను కాదని స్కాట్లాండ్‌కు వలస వెళ్లిన టీ20 క్రికెటర్‌

Published on Wed, 08/13/2025 - 10:29

న్యూజిలాండ్‌ క్రికెటర్‌ టామ్‌ బ్రూస్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న స్కాట్లాండ్‌కు వలస వెళ్లాడు. న్యూజిలాండ్‌ తరఫున సరైన అవకాశాలు రాకపోవడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో జరుగనున్న వరల్డ్‌కప్‌ లీగ్‌-2 మ్యాచ్‌ల కోసం బ్రూక్‌ స్కాట్లాండ్‌ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. 

బ్రూస్‌ తండ్రి స్వస్థలం స్కాట్లాండే కావడంతో అతనికి ఈ అవకాశం దక్కింది. బ్రూస్‌ న్యూజిలాండ్‌కు ఆడకముందు 2016లో స్కాట్లాండ్‌ డెవలెప్‌మెంట్‌ జట్టుకు ఆడాడు.

2017లో బ్రూస్‌ న్యూజిలాండ్‌ తరఫున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. బ్రూస్‌ న్యూజిలాండ్‌ తరఫున రెండో మ్యాచ్‌లోనే మ్యాచ్‌ విన్నింగ్‌ హాఫ్‌ సెంచరీ సాధించి పర్వాలేదనిపించాడు. ఆతర్వాత అతను అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు. తదుపరి 15 ఇన్నింగ్స్‌ల్లో మరో ఫిఫ్టి మాత్రమే చేయగలిగాడు. దీంతో జట్టులో స్థానం గల్లంతైంది.

2020లో స్వదేశంలో భారత్‌తో జరిగిన సిరీస్‌లో అతను చివరిసారిగా న్యూజిలాండ్‌కు ఆడాడు. ఆ సిరీస్‌లో వరుస డకౌట్ల కారణం​గా అతనిపై వేటు పడింది. ఆ సిరీస్‌ను న్యూజిలాండ్‌ 0-5 తేడాతో భారత్‌కు కోల్పోయింది.

భారత్‌తో సిరీస్‌ తర్వాత బ్రూస్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా జట్టులోకి రాలేకపోయాడు. దీంతో కెరీర్‌ను కొనసాగించేందుకు తన తండ్రి స్వస్థలమైన స్కాట్లాండ్‌కు వలస వెళ్లాడు. అక్కడ దేశవాలీ మ్యాచ్‌ల్లో సత్తా చాటి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. 2017-2020 మధ్యలో బ్రూస్‌ న్యూజిలాండ్‌ తరఫున 17 మ్యాచ్‌లు ఆడి 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 122.44 స్ట్రయిక్‌రేట్‌తో 279 పరుగులు చేశాడు.

స్కాట్లాండ్‌ వన్డే జట్టుకు ఎంపికైన అనంతరం బ్రూస్‌ ఇలా అన్నాడు. "మా కుటుంబానికి స్కాటిష్ చరిత్ర ఉంది. స్కాట్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. ప్రపంచ వేదికపై స్కాట్లాండ్ విజయానికి నా వంతు కృషి చేస్తాను". ఈ మార్పుతో బ్రూస్ రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.

కాగా, వరల్డ్‌కప్‌ లీగ్‌-2లో భాగంగా స్కాట్లాండ్‌ కెనడా, నమీబియా దేశాలతో ఆగస్ట్‌ 29-సెప్టెంబర్‌ 6 మధ్యలో నాలుగు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.

 

 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)