Breaking News

'వ‌ర‌ల్డ్‌క‌ప్ ఒక ఫారెస్ట్ లాంటిది.. వారిద్ద‌రి ఆట తీరు మారాలి'

Published on Mon, 02/23/2026 - 20:01

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2026లో టీమిండియా యువ బ్యాట‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, తిల‌క్ వ‌ర్మ‌లు దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నారు. అభిషేక్ శ‌ర్మ వ‌రుస‌గా మూడు డకౌట్లు కాగా.. తిల‌క్ కూడా త‌న జిడ్డు బ్యాటింగ్‌తో తీవ్ర నిరాశ‌ప‌రుస్తున్నాడు.

ఆదివారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రిగిన సూప‌ర్‌-8 మ్యాచ్‌లో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. అభిషేక్ 13 ప‌రుగులు చేయ‌గా, తిల‌క్ డ‌కౌట‌య్యాడు.  ఇప్పటివరకు తిల‌క్‌ ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో 21.40 సగటుతో కేవలం 107 పరుగులు మాత్రమే చేశాడు.

అతని స్ట్రైక్ రేట్ 119 కంటే త‌క్కువ‌గా ఉంది. ఈ నేప‌థ్యంలో వీరిద్ద‌రిపై భార‌త మాజీ క్రికెట‌ర్ సదాగోపన్ రమేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీల్లో ఒత్తిడిని తట్టుకోలేకపోతే ఇటువంటి ఫ‌లితాలే ఎదుర‌వ‌తాయ‌ని అత‌డు హెచ్చ‌రించాడు.

"అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇప్పటివరకు వారు చూసింది కేవ‌లం గార్డెన్ మాత్ర‌మే, కానీ ప్రపంచకప్ అనేది ఒక అడవి లాంటిది. ఇక్కడ వేటాడాలి, లేదంటే మీరే బ‌లి అవుతారు. ఇటువంటి ఐసీసీ టోర్నీల్లో ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుంది. దానిని త‌ట్టుకుని ఆడడం నేర్చుకోవాలి" అని రమేష్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.

ఇక డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ త‌మ తొలి సూప‌ర్‌-8 మ్యాచ్‌లోనే ఓడిపోవడంతో సెమీస్ అవ‌కాశాలు సంక్లిష్టం చేసుకుంది. భార‌త్ సెమీస్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల‌లో భారీ తేడాతో విజ‌యం సాధించాలి.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)