Breaking News

మొదట్లో అతడిని పక్కనపెట్టి తప్పు చేశారు: భారత మాజీ క్రికెటర్‌

Published on Sat, 01/04/2025 - 13:03

యువ పేసర్‌ ప్రసిద్‌ కృష్ణ సేవలను ఉపయోగించుకోవడంలో టీమిండియా యాజమాన్యం విఫలమైందని భారత మాజీ క్రికెటర్‌ దొడ్డ గణేశ్‌ అన్నాడు. ఫామ్‌లో ఉన్న బౌలర్‌కు అవకాశం ఇవ్వకపోవడాన్ని మూర్ఖపు చర్యగా అభివర్ణించాడు. వేరొకరిని తుదిజట్టులో ఆడించడం కోసం ప్రసిద్‌ను పక్కనపెట్టడం సరికాదని పేర్కొన్నాడు. కాగా 2023లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు 28 ఏళ్ల ప్రసిద్‌(Prasidh Krishna).

షమీ లేకపోవడంతో
కర్ణాటకకు చెందిన ఈ రైటార్మ్‌ ఫాస్ట్‌బౌలర్‌ సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ సందర్భంగా ఎంట్రీ ఇచ్చి.. రెండు మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ టెస్టు జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. అయితే, బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border Gavaskar Trophy)కి సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ దూరమైన కారణంగా ప్రసిద్‌కు మరోసారి టెస్టు జట్టులో చోటు దక్కింది.

పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌తో పాటు యువ ఆటగాళ్లు హర్షిత్‌ రాణా, ఆకాశ్‌ దీప్‌లతో కలిసి ఫాస్ట్‌ బౌలర్ల విభాగంలో ప్రసిద్‌ స్థానం సంపాదించాడు. 

అయితే, బుమ్రా, సిరాజ్‌లతో పాటు హర్షిత్‌ రాణాకు మేనేజ్‌మెంట్‌ ప్రాధాన్యం ఇచ్చింది. పెర్త్‌ వేదికగా అతడికి అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చింది. ఫలితంగా ప్రసిద్‌ కృష్ణకు మొండిచేయి ఎదురైంది.

ఆకాశ్‌ దీప్‌ గాయం కారణంగా
ఇక ఆసీస్‌తో తొలి టెస్టులో నాలుగు వికెట్లతో చెలరేగిన హర్షిత్‌ రాణా..  అడిలైడ్‌లో జరిగిన పింక్‌ బాల్‌ టెస్టులో మాత్రం తేలిపోయాడు. ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. ఈ క్రమంలో హర్షిత్‌పై వేటు వేసిన యాజమాన్యం.. తర్వాతి రెండు టెస్టుల్లో ఆకాశ్‌ దీప్‌ను ఆడించింది. దీంతో మరోసారి ప్రసిద్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.

అయితే, కీలకమైన ఐదో టెస్టుకు ముందు ఆకాశ్‌ గాయపడటంతో ప్రసిద్‌ కృష్ణకు ఎట్టకేలకు తుదిజట్టులో చోటు దక్కింది. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఈ ఆఖరి టెస్టులో ప్రసిద్‌ మెరుగ్గా రాణించాడు. స్టీవ్‌ స్మిత్‌(33), అలెక్స్‌ క్యారీ(21), బ్యూ వెబ్‌స్టర్‌(57) రూపంలో మూడు కీలక వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బకొట్టాడు.

అనధికారిక సిరీస్‌లోనూ సత్తా చాటి
మొత్తంగా 15 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 42 పరుగులే ఇచ్చి ఇలా విలువైన వికెట్లు తీసి.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 181 పరుగులకే ఆలౌట్‌ చేయడంలో ప్రసిద్‌ తన వంతు పాత్ర పోషించాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. తన సత్తా ఏమిటో చాటుకోగలిగాడు. అంతేకాదు.. అంతకు ముందు భారత్‌-‘ఎ’ తరఫున ఆస్ట్రేలియా- ‘ఎ’ జట్టుతో అనధికారిక సిరీస్‌లోనూ ప్రసిద్ కృష్ణ పది వికెట్లతో మెరిశాడు.

తప్పు చేశారు
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, కర్ణాటకకు చెందిన దొడ్డ గణేశ్‌ స్పందిస్తూ.. ‘‘టెస్టు సిరీస్‌ మొదలుకావడానికి ముందు భారత్‌-‘ఎ’ తరఫున అతడి ప్రదర్శన ఎలా ఉందో చూసిన తర్వాత కూడా.. ప్రసిద్‌ను కాదని హర్షిత్‌ రాణాను ఎంపిక చేయడం బుర్రలేని పని. 

ప్రసిద్‌ మంచి రిథమ్‌లో ఉన్నాడు. అయినా సరే.. సిరీస్‌ ఆరంభం నుంచి అతడిని తుదిజట్టులోకి తీసుకోకుండా మేనేజ్‌మెంట్‌ తప్పుచేసింది’’ అని పేర్కొన్నాడు.

కాగా సిడ్నీ వేదికగా శుక్రవారం మొదలైన ఐదో టెస్టులో టాస్ గెలిచిన భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లొ 185 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం ఆసీస్‌ను 181 పరుగులకే కుప్పకూల్చి నాలుగు పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. 

అనంతరం శనివారం నాటి రెండో రోజు ఆట పూర్తయ్యేసరికి 32 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి బారత్‌ 141 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌తో కలుపుకొని ఆసీస్‌ కంటే 145 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

చదవండి: IND vs AUS: పంత్‌ సరికొత్త చరిత్ర.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)