మ్యాచ్‌ జరుగుతుండగా గుండెపోటు.. ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డ స్టార్‌ క్రికెటర్‌

Published on Tue, 03/25/2025 - 14:52

బంగ్లాదేశ్‌ దిగ్గజ బ్యాటర్‌, ఆ దేశ మాజీ కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌ (36) నిన్న ఉదయం తీవ్రమైన గుండెపోటుకు గురయ్యాడు. ఢాకా ప్రీమియర్‌ లీగ్‌లో మ్యాచ్‌ ఆడుతుండగా ఈ ఘటన జరిగింది. ఫీల్డింగ్‌ చేస్తుండగా తమీమ్‌కు రెండు సార్లు ఛాతీ నొప్పి వచ్చినట్లు తెలుస్తుంది. విషయం తెలిసి అందుబాటులో ఉన్న వారు తమీమ్‌ను ఆసుపత్రికి తరలించారు. స్పృహ కోల్పోయిన తమీమ్‌కు ఆసుపత్రిలో డాక్టర్లు గంట సేపు సీపీఆర్‌ చేశారు. 

డాక్టర్లు తమీమ్‌ గుండె ధమనాల్లో పూడికలు ఉన్నట్లు గుర్తించారు. నిన్ననే తమీమ్‌ గుండెకు స్టంట్‌లు వేశారు. తమీమ్‌ ఆసుపత్రికి చేరిన సమయంలో పరిస్థితి విషమంగా ఉండిందని డాక్టర్లు తెలిపారు. ఆసుపత్రికి రావడం లేట్‌ అయ్యుంటే తమీమ్‌ ప్రాణాలు కోల్పోయేవాడని అన్నారు.

ప్రస్తుతం తమీమ్‌ ప్రాణాపాయస్థితి నుంచి బయటపడి కోలుకునే క్రమంలో ఉన్నాడని తెలుస్తుంది. తమీమ్‌ ఇవాళ ఉదయమే స్పృహలోకి వచ్చాడని సమాచారం​. తమీమ్‌ తన కుటుంబ సభ్యులతో మాట్లాడాడని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి.

తమీమ్‌ గుండెపోటుకు గురయ్యాడని తెలిసి క్రికెట్‌ ప్రపంచం స్పందించింది. తమీమ్‌ కుటుంబ సభ్యుల్లో మనో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది. తమీమ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. నిన్ననే పుట్టిన రోజు జరుపుకున్న బంగ్లాదేశ్‌ స్టార్‌ క్రికెటర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ తమీమ్‌ త్వరగా కోలుకోవాలని దేవుడిని వేడుకున్నాడు. తమీమ్‌ ఆరోగ్యం గురించి ప్రార్థనలు చేయాలని అభిమానులకు పిలుపునిచ్చాడు.

తమీమ్‌ పరిస్థితి తెలిసి టీమిండియా మాజీ ఆటగాడు, సిక్సర్ల వీరుడు యువరాజ్‌ సింగ్‌ కూడా స్పందించాడు. ఇంతకంటే కఠినమైన పరిస్థితులను మైదానంలో ఎదుర్కొన్నావు. విజయవంతమయ్యావు. ఇప్పుడూ అంతే, త్వరగా కోలుకుని విజయవంతంగా తిరిగొస్తావంటూ ట్వీట్‌ చేశాడు.

కాగా, తమీమ్‌ బంగ్లాదేశ్‌ తరఫున 16 ఏళ్ల కెరీర్‌లో 391 మ్యాచ్‌లు ఆడి 15000 పైచిలుకు పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చలామణి అవుతున్నాడు. తమీమ్‌ బంగ్లాదేశ్‌ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు కలిగి ఉన్నాడు. తమీమ్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 25 సెంచరీలు బాదాడు. తమీమ్‌ 2020-2023 మధ్యలో బంగ్లాదేశ్‌ వన్డే జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)