Breaking News

‘నితీశ్‌.. జీనియస్‌’

Published on Thu, 01/02/2025 - 03:45

సిడ్నీ: ఆ్రస్టేలియా పర్యటనలో అదరగొడుతున్న ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డిపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్    మైకెల్‌ క్లార్క్‌ ప్రశంసలు కురిపించాడు. మెల్‌బోర్న్‌ టెస్టులో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగిన నితీశ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో క్లార్క్‌ మాట్లాడుతూ... ‘నితీశ్‌ జీనియస్‌. చిన్న వయసులో అతడి ఆటతీరు అమోఘం. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చక్కటి సెంచరీతో ఆకట్టుకున్నాడు. 

అతడికింకా 21 ఏళ్లే. ‘బోర్డర్‌–గావస్కర్‌’ సిరీస్‌ ప్రారంభానికి ముందు అతడి గురించి ఎవరూ పెద్దగా ఆలోచించలేదు. కానీ తన ఆటతీరుతో నితీశ్‌ అందరినీ ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లను చూసి అతడు భయపడలేదు. అవసరమైన సమయంలో సంయమనం చూపాడు. టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్‌ చేయడం అంత సులువు కాదు. కానీ అతడు దాన్ని చేసి చూపాడు. 

సమయానుకూలంగా బ్యాటింగ్‌ చేస్తూ పరిణతి చూపాడు. భవిష్యత్తులో అతడు ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని భావిస్తున్నా. అదే అతడికి మంచింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో ఇలాంటి చురుకైన కుర్రాడు లభించడం భారత క్రికెట్‌కు మంచి చేస్తుంది. సిడ్నీ టెస్టులో అందరి దృష్టి అతడిపైనే ఉంటుంది’ అని అన్నాడు. ఆ్రస్టేలియాతో సిరీస్‌లో ఫామ్‌ దొరకబుచ్చుకోలేక తంటాలు పడుతున్న టీమిండియా కెపె్టన్‌ రోహిత్‌ శర్మను ఉద్దేశించి కూడా క్లార్క్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. 

జట్టుకు భారమైనట్లు అనిపిస్తే తప్పుకోవడమే మంచిదని అన్నాడు. ‘సిడ్నీ టెస్టు నుంచి రోహిత్‌ను తప్పిస్తారని అనుకోవడం లేదు. కానీ అతడి ప్రదర్శన ఏమాత్రం బాగాలేదు. ఈ సిరీస్‌లో అతడి టెస్టు కెరీర్‌ ముగుస్తుందని అనుకోవడం లేదు. అయితే జట్టును ఇబ్బంది పెడుతూ భారంగా కొనసాగాలని ఏ ఆటగాడు కోరుకోడు’ అని క్లార్క్‌ అన్నాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)