Breaking News

అండర్‌-19 వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. భారత్‌ తొలి మ్యాచ్‌ ఎప్పుడంటే?

Published on Sat, 09/23/2023 - 07:30

వచ్చే ఏడాది శ్రీలంకలో జరిగే అండర్‌ –19 ప్రపంచ కప్‌ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. 18 ఏళ్ల త‌ర్వాత ఈ పోటీల‌కు శ్రీ‌లంక ఆతిథ్యం ఇస్తోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 4 వరకు కొలంబోలో ఈ టోర్నీ జరుగుతుంది. తొలి మ్యాచ్‌లో  జనవరి 13న జింబాబ్వేతో ఆతిథ్య శ్రీలంక తలపడనుంది. 

ఈ టోర్నీలో పాల్గోనే 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి మొదటి మూడు జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుకుంటాయి. సూపర్‌-సిక్స్‌లో ప్రదర్శన ఆధారంగా మళ్లీ రెండు గ్రూప్‌లుగా విడిపోయి తలపడతాయి. ఈ రెండు గ్రూపుల్లో మొత్తం 12 జట్లు ఉంటాయి.

ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి.  సెమీస్‌ నుంచి రెండు జట్లు ఫైనల్‌కు చేరుతాయి. ఫిబ్రవరి 4న కొలంబో వేదికగా ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ భారత్‌ 14న తమ తొలి మ్యాచ్‌లో బం‍గ్లాదేశ్‌ను 'ఢీ' కొంటుంది. 

గ్రూప్ ‘ఎ’లో భారత్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికాలు ఉండగా, గ్రూప్ ‘బి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. గ్రూప్ ‘సి’లో ఆస్ట్రేలియా, జింబాబ్వే, నమీబియా, ఆతిథ్య శ్రీలంక, గ్రూప్ ‘డి’లో పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, న్యూజిలాండ్, నేపాల్ ఉన్నాయి.


చదవండి: World Cup 2023 Prize Money: వన్డే ప్రపంచకప్‌ 2023 ప్రైజ్‌మనీ ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే..!

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)