Breaking News

IND VS NZ 3rd Test: క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఇలా..!

Published on Sun, 11/03/2024 - 19:23

టెస్ట్‌ క్రికెట్‌ చరిత్ర ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు లెఫ్ట్‌ ఆర్మ్‌  బౌలర్లు నాలుగు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇలా జరగడం ఇది తొలిసారి. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన మూడో టెస్ట్‌లో ఇది జరిగింది. టీమిండియా బౌలర్‌ రవీంద్ర జడేజా, న్యూజిలాండ్‌ బౌలర్‌ అజాజ్‌ పటేల్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు. జడేజా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయగా.. అజాజ్‌ పటేల్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు.

కాగా, న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో టీమిండియా 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 235 పరుగులకు ఆలౌటైంది. విల్‌ యంగ్‌ (71), డారిల్‌ మిచెల్‌ (82) రాణించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్‌ సుందర్‌ నాలుగు, ఆకాశ్‌దీప్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన భారత్‌.. 263 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్‌ గిల్‌ (90), రిషబ్‌ పంత్‌ (60) అర్ద సెంచరీలతో రాణించారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో అజాజ్‌ పటేల్‌ ఐదు వికెట్లు పడగొట్టాడు.

28 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌ 174 పరుగులకు ఆలౌటైంది. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీయగా.. అశ్విన్‌ మూడు, వాషింగ్టన్‌ సుందర్‌, ఆకాశ్‌దీప్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 147 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని  ఛేది​ంచేందుకు బరిలోకి దిగిన భార‌త్  121 ప‌రుగుల‌కే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. న్యూజిలాండ్‌ బౌలర్లలో అజాజ్ ప‌టేల్ 6 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ఫిలిప్స్ 3 వికెట్ల‌తో తీశాడు. భార‌త బ్యాట‌ర్ల‌లో రిష‌బ్ పంత్(64) మిన‌హా మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. 
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)