Breaking News

వన్డే సమరానికి సై

Published on Sun, 11/30/2025 - 02:47

దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో అనూహ్యంగా చిత్తయిన తర్వాత ఇప్పుడు సొంతగడ్డపై మరో ఫార్మాట్‌లో పరువు నిలబెట్టుకునేందుకు భారత్‌ బరిలోకి దిగుతోంది. గత రెండేళ్లలో నిలకడగా రాణిస్తూ వరుస విజయాలు సాధించిన వన్డేల్లో అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. 

టెస్టు జట్టుతో పోలిస్తే కెప్టెన్‌గా రాహుల్‌ రావడం సహా పలు మార్పులతో భారత్‌ సిద్ధం కాగా...చాలా కాలం తర్వాత భారత గడ్డపై ఆడుతున్న  విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలపైనే అందరి దృష్టీ నిలిచింది. మరో వైపు వన్డేల్లో ఇటీవల పెద్దగా రాణించలేకపోయినా... టెస్టు సిరీస్‌ విజయం ఇచి్చన ఉత్సాహంతో సఫారీ జట్టు మరో సంచలనాన్ని ఆశిస్తోంది. కెప్టెన్‌గా తెంబా బవుమా మరోసారి టీమ్‌ను విజయం దిశగా నడిపించాలని ఆశిస్తున్నాడు.  

రాంచీ: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) కారణంగా టెస్టు మ్యాచ్‌లకు, వచ్చే ఏడాది ఆరంభంలో ప్రపంచ కప్‌ జరగనున్న నేపథ్యంలో టి20లపై ప్రస్తుతం అన్ని జట్లూ ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వన్డే మ్యాచ్‌ల ప్రాధాన్యత తాజా సీజన్‌లో కాస్త తగ్గినట్లు కనిపించింది. అయితే భారత గడ్డపై జరిగే ఎలాంటి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌పైనైనా ఉండే ఆసక్తి వేరు. 

ఈ నేపథ్యంలో మరో వన్డే సిరీస్‌కు రంగం సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల పోరులో భాగంగా నేడు తొలి వన్డే జరుగుతుంది. గత రెండు దశాబ్దాల్లో ఇరు జట్ల మధ్య 10 వన్డే సిరీస్‌లు జరగ్గా...చెరో ఐదు సిరీస్‌లు గెలిచి భారత్, దక్షిణాఫ్రికా సమంగా ఉన్నాయి.  

జైస్వాల్, రుతురాజ్‌కు చాన్స్‌... 
దాదాపు నెల రోజుల క్రితం భారత జట్టు సిడ్నీలో తమ చివరి వన్డే ఆడింది. నాటి టీమ్‌తో పోలిస్తే రెండు తప్పనిసరి మార్పులు జట్టులో చోటు చేసుకున్నాయి. తొలి టెస్టులో గాయపడి ఆటకు దూరమైన గిల్‌ స్థానంలో ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌ రానున్నాడు. గిల్‌ గైర్హాజరులో రాహుల్‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. మరో వైపు గాయంతోనే ఆటనుంచి తప్పుకున్న మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ స్థానంలో రుతురాజ్‌కు చోటు ఖాయమైంది. 

అయితే ఎప్పటిలాగే రోహిత్, కోహ్లిల గురించి మరో సారి చర్చ సాగుతోంది. 2027 వరల్డ్‌ కప్‌లో ఆడాలని పట్టుదలగా ఉన్న వీరిద్దరు ఎలాంటి అవకాశం వదులుకోరాదని భావిస్తున్నారు. సిడ్నీలో రోహిత్‌ సెంచరీలతో చెలరేగగా, కోహ్లి కూడా 74 పరుగులతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో వీరి ఫామ్‌ గురించి ఎలాంటి ఆందోళన లేదు. అభిమానుల కోణంలో చూస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో వీరు ఆఖరి సారిగా భారత గడ్డపై ఆడారు. 

ఇప్పుడు మైదానంలోకి దిగి సత్తా చాటాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. జట్టులో ముగ్గురు ఆల్‌రౌండర్లు ఉండాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది కాబట్టి నితీశ్‌ రెడ్డికి అవకాశం దక్కవచ్చు. మరో ముగ్గురు రెగ్యులర్‌ పేసర్లు హర్షిత్, ప్రసిధ్, అర్ష్  దీప్‌ ఆడే అవకాశం ఉంది. ఆ్రస్టేలియా సిరీస్‌తో చాన్స్‌ లభించని రవీంద్ర జడేజా మరోసారి తన స్థాయిని ప్రదర్శించాలని భావిస్తున్నాడు. పంత్‌కు తుది జట్టులో చోటు కష్టమే.  

మాథ్యూ బ్రీట్‌కీ జోరు కొనసాగేనా... 
చాలా కాలం తర్వాత దక్షిణాఫ్రికా వన్డేల్లో పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది. టాప్‌ పేసర్‌ రబాడ గాయంనుంచి పూర్తిగా కోలుకోలేదు కాబట్టి ఇక్కడా ఆడటం సందేహంగానే అనిపిస్తోంది. అయితే టెస్టుల్లో చెలరేగిన యాన్సెన్‌తో పాటు బర్గర్, ఎన్‌గిడి రూపంలో పదునైన పేసర్లు టీమ్‌లో ఉన్నారు. కేశవ్‌ మహరాజ్‌ స్పిన్‌ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. 

సీనియర్‌ ప్లేయర్‌ డి కాక్‌తో పాటు ఐపీఎల్‌ స్టార్‌ బ్రెవిస్, మార్క్‌రమ్‌లపై ప్రధానంగా జట్టు బ్యాటింగ్‌ ఆధారపడి ఉంది. మూడో స్థానంలో కెప్టెన్‌ బవుమా కీలక ఆటగాడు. అయితే ఇటీవల అందరికంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న ప్లేయర్‌ మాథ్యూ బ్రీట్‌కీ. తన తొలి ఐదు వన్డేల్లోనే ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా అందరి దృష్టిలో పడిన బ్రీట్‌కీ భారత గడ్డపై ఎలా ఆడతాడో చూడాలి.

పిచ్, వాతావరణం
అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌కు సమానంగా అనుకూలించే సాధారణ వికెట్‌. గతంలో జరిగిన ఐదు వన్డేల్లో ఒకే ఒక్కసారి స్కోరు 300 దాటింది కాబట్టి పరుగుల వరద పారించే మైదానం మాత్రం కాదు. వాతావరణం అనుకూలంగా ఉంది. వర్షసూచన లేదు. మంచు ప్రభావం లేకపోతే టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకోవచ్చు.

తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్‌: రాహుల్‌ (కెప్టెన్‌), రోహిత్, జైస్వాల్, కోహ్లి, రుతురాజ్, సుందర్, జడేజా, నితీశ్‌ రెడ్డి, హర్షిత్, అర్ష్ దీప్, ప్రసిధ్‌.  
దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్‌), మార్క్‌రమ్, డి కాక్, బ్రీట్‌కీ, బ్రెవిస్, హెర్మన్, యాన్సెన్, బాష్, మహరాజ్, బర్గర్, ఎన్‌గిడి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)