Breaking News

IPL 2025: ‘క్వాలిఫయర్‌-1, ఫైనల్‌ ఆడే జట్లు ఇవే!’

Published on Mon, 05/26/2025 - 15:40

ఐపీఎల్‌-2025 (IPL 2025) ముగింపు దశకు వచ్చేసింది. గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌నకు అర్హత సాధించగా.. క్వాలిఫయర్‌-1 కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. లీగ్‌ దశ ముగిసే సరికి టాప్‌-2లో ఉన్న జట్లు ఈ పోరుకు అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే.

ఆ రెండు మ్యాచ్‌ల ఫలితాలతో..
సీజన్‌లో పద్నాలుగు మ్యాచ్‌లూ పూర్తి చేసుకున్న గుజరాత్‌.. తొమ్మిది గెలిచి 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. మిగిలిన మూడు జట్లకు లీగ్‌ దశలో ఒక్కో మ్యాచ్‌ మిగిలి ఉండగా.. ఓవరాల్‌గా సీజన్‌లో రెండు మిగిలి ఉన్నాయి. ఇందులో భాగంగా సోమవారం పంజాబ్‌ కింగ్స్‌- ముంబై ఇండియన్స్‌  తలపడనుండగా.. మంగళవారం నాటి పోరులో ఆర్సీబీ లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఆడుతుంది.

ఈ మ్యాచ్‌ తర్వాత టాప్‌-2లో నిలిచి క్వాలిఫయర్‌-1 ఆడే జట్లు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడే జట్లు ఏవో తేలుతాయి. ఇక క్వాలిఫయర్‌-1లో ఓడిపోయిన జట్టు.. ఎలిమినేటర్‌ విజేతతో క్వాలిఫయర్‌-2లో తలపడుతుందన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు, క్వాలిఫయర్‌-1 విజేత టైటిల్‌ పోరుకు అర్హత సాధిస్తాయి.

ఫైనల్‌ ఆడే జట్లు ఇవే
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా క్వాలిఫయర్‌-1, ఫైనల్లో తలపడే జట్లపై తన అంచనా తెలియజేశాడు. పంజాబ్‌ కింగ్స్‌పై ముంబై, లక్నోపై ఆర్సీబీ గెలిచి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలు ఆక్రమిస్తాయని జోస్యం చెప్పాడు.

అదే విధంగా.. ఈ రెండు జట్లే ట్రోఫీ కోసం ఫైనల్లో తలపడతాయని అంచనా వేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌లో మాట్లాడుతూ.. ‘‘ముంబై పంజాబ్‌పై గెలవాలని పట్టుదలగా ఉంది. వాళ్లు గనుక గెలిస్తే టాప్‌-2లోకి వస్తారు. ఇది జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఇక ఆర్సీబీ కూడా అంతే. లక్నోపై ఆ జట్టు గెలిచే ఛాన్స్‌ ఎక్కువగా ఉంది. నా అంచనా ప్రకారం ముంబై- ఆర్సీబీ టాప్‌-2లో నిలుస్తాయి. అదే విధంగా ఈ రెండు జట్లే ఫైనల్లోనూ తలపడతాయి’’ అని మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

మిగిలిన షెడ్యూల్‌ ఇలా
👉క్వాలిఫయర్‌-1: మే 29, గురువారం, చండీగఢ్‌
👉ఎలిమినేటర్‌ మ్యాచ్‌: మే 30, శుక్రవారం, చండీగఢ్‌
👉క్వాలిఫయర్‌-2: జూన్‌ 1, ఆదివారం, అహ్మదాబాద్‌
👉ఫైనల్‌: జూన్‌ 3, మంగళవారం, అహ్మదాబాద్‌.

చదవండి: Pat Cummins: ఫైనల్‌ చేరాల్సిన జట్టు.. మా వాళ్లను చూస్తే నాకే భయమేసింది

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)