ఫిఫా ప్రపంచ కప్: ఇంగ్లండ్‌ సెమీస్‌కి.. నార్వే ఇంటికి..

Published on Sun, 07/12/2026 - 05:18

మయామి స్టేడియంలో జరిగిన మూడో క్వార్టర్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ 2–1 గోల్స్‌ తేడాతో నార్వే జట్టును ఓడించి ప్రపంచకప్‌లో నాలుగోసారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. విజేత ఎవరో తేలేందుకు అదనంగా 30 నిమిషాలు ఆడించారు. 

ఈ అదనపు సమయంలో ఇంగ్లండ్‌ ఒక గోల్‌ సాధించి విజయాన్ని అందుకుంది. ఇంగ్లండ్‌ నమోదు చేసిన రెండు గోల్స్‌ జూడ్‌ బెలింగ్‌హమ్‌ (45+2వ నిమిషంలో, 93వ నిమిషంలో) సాధించడం విశేషం. నార్వే జట్టుకు ఆండ్రీస్‌ షాజెల్డర్ప్‌ (36వ నిమిషంలో) ఏకైక గోల్‌ అందించాడు. 

ఇక 56వ నిమిషంలో నార్వే ప్లేయర్‌ టార్బన్‌ హెగెమ్‌ చేసిన గోల్‌ను రిఫరీ వీడియో రీప్లే సమీక్షించాక నిరాకరించారు. ‘డి’ ఏరియాలో నార్వే స్టార్‌ ఎర్లింగ్‌ హాలాండ్‌ ఫౌల్‌ చేయడంతో రిఫరీ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఈ టోర్నీలో ఏడు గోల్స్‌తో అదరగొట్టిన నార్వే స్టార్‌ ఎర్లింగ్‌ హాలాండ్‌ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. ఎర్లింగ్‌ను ఇంగ్లండ్‌ ప్లేయర్లు వ్యూహత్మంగా కట్టడి చేశారు. ఫలితంగా ఎర్లింగ్‌ కేవలం రెండుసార్లు మాత్రమే ఇంగ్లండ్‌ గోల్‌పోస్ట్‌ లక్ష్యంగా షాట్‌లు కొట్టాడు. దాంతో నిర్ణీత సమయం ముగిశాక నార్వే కోచ్‌ ఎర్లింగ్‌ను వెనక్కి పిలిచి అతని స్థానంలో లార్సన్‌ను సబ్‌స్టిట్యూట్‌గా ఆడించారు. 

కాగా 1966లో ఏకైకసారి ఇంగ్లండ్‌ ప్రపంచకప్‌ సాధించగా... 1990 సెమీఫైనల్లో జర్మనీ చేతిలో... 2018 సెమీఫైనల్లో క్రొయేషియా చేతిలో ఓడిపోయింది. మరోవైపు.. నార్వే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సెమీస్ చేరలేదు. ఈసారి కూడా  క్వార్టర్ ఫైనల్లోనే నిరాశగా వెనుదిరిగింది.

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)