కేన్‌ డబుల్‌ ధమాకా.. క్రొయేషియాపై ఇంగ్లండ్‌ థ్రిల్లింగ్‌ విక్టరీ

Published on Thu, 06/18/2026 - 04:00

2026 ఫిఫా ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ శుభారంభం చేసింది. గ్రూప్‌-ఎల్‌లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో క్రొయేషియాపై 4-2తో విజయం సాధించింది. స్టార్‌ స్ట్రైకర్‌ హ్యారీ కేన్‌ రెండు గోల్స్‌తో మెరిసి జట్టు విజయానికి ప్రధాన కారణమయ్యాడు.

మ్యాచ్‌ 12వ నిమిషంలో పెనాల్టీ ద్వారా కేన్‌ ఇంగ్లండ్‌కు ఆధిక్యం అందించాడు. తొలి ప్రయత్నాన్ని క్రొయేషియా గోల్‌కీపర్‌ అడ్డుకున్నప్పటికీ, వీడియో రివ్యూ అనంతరం రిఫరీ పెనాల్టీని మళ్లీ తీసుకోవాలని ఆదేశించడంతో రెండోసారి కేన్‌ గోల్‌ చేశాడు.

అయితే 36వ నిమిషంలో మార్టిన్‌ బటురినా గోల్‌తో క్రొయేషియా స్కోరును సమం చేసింది. ఆరు నిమిషాలకే కేన్‌ మరోసారి హెడర్‌తో గోల్‌ చేసి ఇంగ్లండ్‌ను మళ్లీ ముందంజలో నిలిపాడు. దీంతో ప్రపంచకప్‌ల్లో అతని గోల్స్‌ సంఖ్య 10కు చేరి ఇంగ్లండ్‌ దిగ్గజం గ్యారీ లింకర్‌ రికార్డును సమం చేశాడు.

మొదటి అర్థం అదనపు సమయంలో పీటర్‌ ముసా గోల్‌ చేయడంతో క్రొయేషియా మరోసారి స్కోర్‌ను సమం చేసింది (2-2).

రెండో అర్థ భాగం ప్రారంభమైన రెండో నిమిషానికే జూడ్‌ బెల్లింగ్హమ్‌ అద్భుత గోల్‌తో ఇంగ్లండ్‌ను 3-2తో ముందుకు తీసుకెళ్లాడు. అనంతరం ఇంగ్లండ్‌ పలు అవకాశాలను వృథా చేసుకున్నప్పటికీ, మ్యాచ్‌ ముగియడానికి ఐదు నిమిషాల ముందు ప్రత్యామ్నాయ ఆటగాడిగా వచ్చిన మార్కస్‌ రూథర్‌ఫోర్డ్‌ నాలుగో గోల్‌ చేసి ఇంగ్లండ్‌ విజయం ఖాయం చేశాడు.

2018 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో తమను ఓడించిన క్రొయేషియాపై ఇంగ్లండ్‌ ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకుంది. 1966 తర్వాత తొలి ప్రపంచకప్‌ టైటిల్‌ లక్ష్యంగా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఈ విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

 

 

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)