Breaking News

కాలికి పట్టిన దరిద్రం.. ఫోర్‌ ఇలా కూడా పోతుందా?

Published on Mon, 03/13/2023 - 18:31

క్రికెట్‌లో ఫన్నీ ఘటనలు చాలా చూస్తుంటాం. అందులో కొన్ని చూడగానే నవ్వు తెప్పిస్తాయి. మరింత నవ్వుకునేలా ఉంటే పదేపదే వీడియోనూ రిపీట్‌గా వేసుకొని చూస్తుంటాం. తాజాగా అలాంటిదే ఒక సంఘటన క్లబ్‌ క్రికెట్‌లో జరిగింది. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఫీల్డర్‌ బౌండరీని ఆపే క్రమంలో జరిగిన చర్య సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా మన కాళ్లకు పట్టిన దరిద్రం త్వరగా వదలదు అని పెద్దలు అంటుంటారు.

అది ఇక్కడ అక్షరాలా నిజమైంది. విషయంలోకి వెళితే.. బౌలర్‌ వేసిన బంతిని బ్యాటర్‌ ఏదో ఆడాలని ప్రయత్నిస్తే అది ఇంకో చోట తాకి థర్డ్‌మన్‌ దిశగా వెళ్లింది. బంతి స్పీడ్‌గా వెళ్లిందనుకుంటే పొరపాటే. అక్కడే ఉన్న ఫీల్డర్‌ క్యాచ్‌ కాదు కదా బంతిని ఆపడానికే నానా కష్టాలు పడ్డాడు. తొలిసారి బంతిని అందుకోవడంలో విఫలమయ్యాడు. అయితే పరిగెత్తి బౌండరీ లైన్‌ వద్ద బంతిని పట్టుకోవడంతో అరె ఫోర్‌ ఆగింది కదా అని అనుకున్నాం.

కానీ ఇంతలోనే ఊహించని పరిణామం జరిగింది. కీపర్ వైపు బంతి విసిరితే అతని కాలి షూకు తగిలి మళ్లీ వెనక్కొచ్చింది, బౌండరీ దాటింది. అంత కష్టపడి పరిగెత్తి చివరాఖరికి బంతిని మాత్రం బౌండరీ వెళ్లకుండా ఆపలేకపోయానని తెగ ఫీలయ్యాడు ఫీల్డర్. ఎంత కష్టపడితే ఏం లాభం ఫోర్‌ పోయిందిగా.. ఫోర్‌ ఇలా కూడా పోతుందా అంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ కామెంట్‌ చేశారు.

చదవండి: ఇలా అయితే ఎలా.. బౌలింగ్‌ జాబ్‌ వదిలేయాలా?' 

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)