Breaking News

మిస్‌ అయిన చోటే మళ్లీ దొరికితే!

Published on Mon, 07/03/2023 - 20:58

క్యాచెస్‌ విన్‌ మ్యాచెస్‌ అనేది క్రికెట్‌లో ఒక సూత్రం. పటిష్ట ఫీల్డింగ్‌ వల్ల చాలా జట్లు అద్భుతమైన విజయాలు అందుకున్న దాఖలాలు చాలానే ఉన్నాయి. క్యాచ్‌లు డ్రాప్‌ చేస్తే చివాట్లు పెట్టడం.. స్టన్నింగ్‌ క్యాచ్‌లు అందుకుంటే మెచ్చుకోవడం చూస్తుంటాం. తాజాగా యార్క్‌షైర్‌ క్రికెట్‌ సదరన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఇలాంటి ఫన్నీ ఘటనే చోటుచేసుకుంది.

విషయంలోకి వెళితే.. హ్యాట్‌ఫీల్డ్‌ వేదికగా హ్యాట్‌ఫీల్డ్‌ టౌన్‌ సీసీ ఫస్ట్‌ ఎలెవెన్‌, హల్లమ్‌ సీసీ సెకండ్‌ ఎలెవెన్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన హల్లమ్‌ సీసీ ఎలెవెన్‌ బౌలింగ్‌కు దిగింది. మ్యాచ్‌ సాధారణంగా సాగుతున్న వేళ ఒక క్యాచ్‌ను ఫీల్డర్‌ జారవిడిచాడు. దీంతో ఆటగాళ్లంతా నిరాశకు లోనయ్యారు. అయితే మరుసటి బంతికే ఎవరు ఊహించని విధంగా క్యాచ్‌ జారవిడిచిన ఫీల్డరే మరోసారి మెరిశాడు. బౌలర్‌ వేసిన బంతిని స్లిప్‌ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఉన్న ఫీల్డర్‌ ఒకవైపుగా డైవ్‌ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్‌ క్యాచ్‌ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

హల్లమ్‌ సీసీ తొలుత బ్యాటింగ్‌ చేసి 249 పరుగులు చేసింది. విలియమ్‌ కోట్స్‌ 46 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన హ్యాట్‌ఫీల్డ్‌ 167 పరుగులకే కుప్పకూలింది. హల్లమ్‌ కెప్టెన్‌ నిక్‌ కూపర్‌ నాలుగు వికెట్లు తీయడంతో పాటు ఏడు బౌండరీల సాయంతో 36 బంతుల్లో 37 పరుగులు చేశాడు.

చదవండి: ఆ ముగ్గురిపై సస్పెన్షన్‌ వేటు.. ఆస్ట్రేలియా జట్టుకు క్షమాపణ

Videos

Paradise: ఆ పాట లేకుండానే రిలీజ్.?

2029.. ఏ ఒక్కడిని వదిలిపెట్టను... అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్

మజ్జి శ్రీనివాసరావు TDPలో చేరికపై కొండ రాజీవ్ స్ట్రాంగ్ రియాక్షన్

యూకేలో అల్లకల్లోలం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు..

అక్క స్కెచ్ అదిరిందిగా! బిగ్ బాస్ లోకి రమానందన వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

ఇది పద్దతి కాదు.. కేటీఆర్ పై స్పీకర్ సీరియస్

వైభవ్..నువ్వు సూపర్ రా! బుడోడిపై ఇషాన్ ప్రశంసలు

అడ్డంగా ఇరుక్కున్నాక లోకేశ్ వాయిస్ లో బేస్ తగ్గింది..

అంతర్జాతీయంగా దుమారం రేపుతున్న ట్రంప్ పోస్ట్

ఇన్వెస్టర్లకు బిగ్ అప్ డేట్.. కొత్త ట్రేడింగ్ రూల్స్ ఇవే!

Photos

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)