Breaking News

టీమిండియాతో మ్యాచ్‌.. పాకిస్తాన్‌కు భారీ షాక్‌!

Published on Sun, 06/14/2026 - 08:19

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో హైవోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ద‌మైంది. ఆదివారం ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా గ్రూపు-ఎ మ్యాచ్‌లో భాగంగా భార‌త్‌-పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు పాక్ టీమ్‌కు భారీ షాక్ త‌గిలింది. శ‌నివారం ప్రాక్టీస్ సెష‌న్‌లో ఆ జ‌ట్టు కెప్టెన్ ఫాతిమా సనా  గాయ‌ప‌డింది. 

నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండ‌గా, యువ బ్యాట‌ర్ ఆయేషా జాఫ‌ర్ కొట్టిన షాట్ నేరుగా ఫాతిమా సనా కుడి మోకాలికి త‌గిలింది. దీంతో ఆమె తీవ్ర‌మైన నొప్పితో విలవిల్లాడింది. వెంట‌నే ఫిజియో వ‌చ్చి స‌నాకు చికిత్స అందించాడు. ఆ త‌ర్వాత ఆమె నెట్స్ నుంచి వెళ్లిపోయింది. 

ఫాతిమా తిరిగి ప్రాక్టీస్‌కు రాలేదు. కానీ దాదాపు గంట త‌ర్వాత ఫాతిమా అటు ఇటు న‌డుస్తూ మైదానంలో క‌నిపించింది. అయితే ప్రీ మ్యాచ్ కాన్ఫ‌రెన్స్‌లో పాల్గొన్న ఫాతిమా స‌నాకు త‌న గాయం గురుంచి విలేకరులు ప్ర‌శ్నించారు.

"ఇది అనుకోకుండా జ‌రిగిన సంఘ‌ట‌న మాత్ర‌మే. ఆయేషా ఆడిన షాట్  నా మోకాలికి తగిలింది. ఇప్పుడు కొంచెం నొప్పి త‌గ్గింది. రేపటికల్లా పూర్తిగా కోలుకుంటానని ఆశిస్తున్నాను" అని ఫాతిమా పేర్కొంది. ఒక‌వేళ భార‌త్‌తో మ్యాచ్‌కు    ఫాతిమా దూర‌మైతే వికెట్ కీప‌ర్‌ మునీబా అలీ జ‌ట్టును న‌డిపించే అవ‌కాశ‌ముంది.

 కాగా టీ20ల్లో భార‌త్‌పై పాక్ అంత‌మంచి రికార్డు లేదు. భారత్, పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు 16 సార్లు తలపడ్డాయి. భారత్‌ 16 మ్యాచ్‌లు విజయం సాధించగా.. పాక్‌ కేవలం మూడింట మాత్రమే గెలుపొందింది. 

ఇరు జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్‌ 'మహిళల ఆసియా కప్ 2024'లో జరిగింది. ఇప్పుడు ఫాతిమా కూడా జ‌ట్టులో లేక‌పోతే పాక్‌కు పూర్తిగా గెలిచే అవ‌కాశ‌మే ఉండ‌దు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 నుంచి పాక్ జ‌ట్టులో ఫాతిమా కీల‌క ప్లేయ‌ర్‌గా కొన‌సాగుతోంది.
చదవండి: FIFA World Cup: ఆఖరి క్షణంలో అద్భుతం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)