Breaking News

పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌

Published on Sun, 08/25/2024 - 16:38

మహిళల టీ20 వరల్డ్‌కప్‌ కోసం 15 మంది సభ్యుల పాకిస్తాన్‌ జట్టును ఇవాళ (ఆగస్ట్‌ 25) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా ఫాస్ట్‌ బౌలర్‌ ఫాతిమా సనా ఎంపికైంది. మాజీ కెప్టెన్‌ నిదా దార్‌ స్థానంలో ఫాతిమాను ఎంపిక చేశారు పాక్‌ సెలెక్టర్లు. 22 ఏళ్ల సనాకు గతంలో దేశవాలీ జట్లకు సారథ్యం​ వహించిన అనుభవం ఉంది. సనా.. నిదా గైర్హాజరీలో అప్పుడప్పుడు పాక్‌ కెప్టెన్‌గానూ వ్యవహరించింది. 2023 డిసెంబర్‌లో జరిగిన న్యూజిలాండ్‌ పర్యటనలో సనా నేతృత్వంలోని పాక్‌ థ్రిల్లింగ్‌ సూపర్‌ ఓవర్‌ విక్టరీ సాధించింది.

త్వరలో జరుగబోయే టీ20 వరల్డ్‌కప్‌ కోసం పాక్‌ సెలెక్టర్లు పెద్దగా మార్పులు చేయలేదు. ఇటీవల ముగిసిన ఆసియా కప్‌లోని జట్టునే యధాతథంగా కొనసాగించారు. 2024 వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన వారిలో 2023 టీ20 వరల్డ్‌కప్‌ సభ్యులు 10 మంది ఉండటం విశేషం. అన్‌క్యాప్డ్‌ పేసర్‌ తస్మియ రుబాబ్‌ కొత్తగా జట్టులో చోటు దక్కించుకుంది. ఈ టోర్నీ కోసం పాక్‌ సెలెక్టర్లు ఓ ట్రావెలింగ్‌ రిజర్వ్‌, ఇద్దరు నాన్‌ ట్రావెలింగ్‌ రిజర్వ్‌ ప్లేయర్లను ఎంపిక చేశారు.

కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఇటీవలే బంగ్లాదేశ్‌ నుంచి యూఏఈకి షిఫ్ట్‌ అయిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌లో రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ వేదికను మార్చింది. ఈ మెగా టోర్నీ యూఏఈ వేదికగా అక్టోబర్‌ 3 నుంచి 30వ తేదీ వరకు జరుగనుంది.

పాకిస్థాన్ జట్టు: ఫాతిమా సనా (కెప్టెన్), అలియా రియాజ్, డయానా బేగ్, గుల్ ఫిరోజా, ఇరామ్ జావేద్, మునీబా అలీ (వికెట్ కీపర్), నష్రా సుంధు, నిదా దార్, ఒమైమా సోహైల్, సదాఫ్ షమాస్, సాదియా ఇక్బాల్, సిద్రా అమీన్, సయ్యదా అరూబ్ షా, తస్మియా రుబాబ్, తుబా హసన్

ట్రావెలింగ్ రిజర్వ్: నజిహా అల్వీ (వికెట్ కీపర్)

నాన్ ట్రావెలింగ్ రిజర్వ్‌లు: రమీన్ షమీమ్, ఉమ్-ఎ-హాని

 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి