Breaking News

ఇండియా-ఏ జట్టులో ఓవరాక్షన్‌ ప్లేయర్‌.. అభిమానుల ట్రోల్స్‌

Published on Tue, 07/04/2023 - 21:24

ఏసీసీ మెన్స్‌ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌-2023కి భారత్‌ జట్టును ప్రకటించింది. వన్డే ఫార్మాట్లో నిర్వహించనున్న ఈ టోర్నీకి జూనియర్‌ క్రికెట్‌ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన ఇండియా- ఏ జట్టును ఎంపిక చేసింది. మరో నలుగురికి స్టాండ్‌ బై ప్లేయర్లుగా అవకాశమిచ్చింది. కాగా ఈ టోర్నీకి రియాన్‌ పరాగ్‌ కూడా ఎంపికయ్యాడు. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున ఆడుతున్న రియాన్‌ పరాగ్‌ తన చర్యలతో ఎన్నోసార్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాడు

''ఆడేది తక్కువ.. ఓవరాక్షన్‌ ఎక్కువ'' రియాన్‌ పరాగ్‌పై అభిమానుల ధోరణి ఇలానే ఉంటుంది. మనం కూడా ఇదివరకు చాలాసార్లు చూశాం. అందుకే అతనిపై ఓవరాక్షన్‌ ప్లేయర్‌ అనే ముద్ర ఉంది. ఇక ఐపీఎల్‌ 2023 ఏడు మ్యాచ్‌లాడి 78 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలోనే రియాన్‌ పరాగ్‌పై అభిమానులు సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌ వర్షం కురిపించారు. ఓవరాక్షన్‌ ప్లేయర్‌ను ఎందుకు ఎంపిక చేశారు అంటూ కామెంట్‌ చేశారు.

జూలై 13 నుంచి 23 వరకు టోర్నీ..
జూలై 13 నుంచి జూలై 23 వరకు శ్రీలంకలోని కొలంబోలో ఎమర్జింగ్‌ ఆసియా కప్‌-2023 నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇందులో గ్రూప్‌-బిలో భారత్‌తో పాటు.. నేపాల్‌, యూఏఈ, పాకిస్తాన్‌- ఏ జట్లు.. శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, ఒమన్‌- ఏ జట్లు గ్రూప్‌-ఏలో ఉన్నాయి. ఇరు గ్రూపులలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రెండు జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇందులో గ్రూప్‌-ఏ టాపర్‌తో గ్రూప్‌-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టు తొలి సెమీ ఫైనల్లో.. గ్రూప్‌-బి టాపర్‌తో గ్రూప్‌-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టు రెండో సెమీ ఫైనల్లో తలపడతాయి.  జూలై 23న ఈ టోర్నీ ఫైనల్‌ జరుగనుంది. 

ఎమర్జింగ్‌ ఏసియా కప్‌-2023 భారత- ఏ జట్టు
సాయి సుదర్శన్‌, అభిషేక్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), నికిన్‌ జోస్‌, ప్రదోష్‌ రంజన్‌ పాల్‌, యశ్‌ ధుల్‌(కెప్టెన్‌), రియాన్‌ పరాగ్‌, నిశాంత్‌ సంధు, ప్రభ్‌షిమ్రన్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), ధ్రువ్‌ జురెల్‌(వికెట్‌ కీపర్‌), మానవ్‌ సుతార్‌, యువరాజ్‌సిన్హ్‌ దోడియా, హర్షిత్‌ రానా, ఆకాశ్‌ సింగ్‌, నితీశ్‌ కుమార్‌రెడ్డి, రాజ్‌వర్దన్‌ హంగ్రేకర్‌.

స్టాండ్‌ బై ప్లేయర్లు: హర్ష్‌ దూబే, నేహాల్‌ వధేరా, స్నెల్‌ పటేల్‌, మోహిత్‌ రేద్కార్‌.
కోచింగ్‌ స్టాఫ్‌: సితాంశు కొటక్‌(హెడ్‌కోచ్‌), సాయిరాజ్‌ బహూతులే (బౌలింగ్‌ కోచ్‌), మునిష్‌ బాలి(ఫీల్డింగ్‌ కోచ్‌).

చదవండి: Asia Cup- India A: ఆసియా కప్‌-2023 జట్టు ప్రకటన.. తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్‌రెడ్డికి చోటు

#ZIMVsSCO: హతవిధి.. జింబాబ్వే కొంపముంచిన స్కాట్లాండ్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)