Breaking News

అంతులేని అభిమానం..  ఒక్కడి కోసం బస్సును చుట్టుముట్టారు

Published on Sat, 05/20/2023 - 18:28

ఐపీఎల్‌ ఏ ముహుర్తానా మొదలైందో తెలియదు కానీ క్రికెట్‌ అభిమానులకు ధోని ఫీవర్‌ పట్టుకుంది అని మాత్రం చెప్పగలం. ధోని ఎక్కడికి వెళ్లినా వస్తున్న క్రేజ్‌ మాత్రం ఒక లాగానే ఉంటుంది. తాజాగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే మ్యాచ్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్‌ ప్రారంభానికి ముందు సీఎస్‌కే స్టేడియానికి వస్తున్న వీధులన్నీ జనసంద్రంతో నిండిపోయాయి. 

కారణం బస్సులో ధోని ఉండడమే. స్టేడియానికి వెళ్లే దారి పొడవునా సీఎస్‌కే జెర్సీలు ధరించిన అభిమానులు ఒక దశలో ధోనిని చూడడం కోసం బస్సును చుట్టుముట్టారు. కొందరు కార్ల బానెట్లపై నిలబడి తమ  అభిమాన ఆటగాడికి చేతులూపారు. ధోని చూడడానికి చాలా మంది రావడంతో బస్సు ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. కాసేపు ఉత్కంఠ నెలకొన్నప్పటికి ఆ తర్వాత బస్సుకు దారి ఇచ్చారు.

అయితే అభిమానానికి హద్దులుండవని ఈ సంఘటనతో మరోసారి రుజువు అయింది.  దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన అభిమానులు.. ఒక వ్యక్తికి ఇంత ఫాలోయింగ్‌ ఉంటుందా.. సరిహద్దు లేని అభిమానం అంటే ఇదే అంటూ కామెంట్‌ చేశారు. ఇక సీఎస్‌కే కూడా బస్సును చుట్టుముట్టిన ఫోటోలను షేర్‌ చేస్తూ..  ఒక్కడి కోసం రాజధాని నగరం జనంతో నిండిపోయింది.. ఈ దృశ్యం చూడడానికి మా కళ్లు చాలడం లేదు అంటూ క్యాప్షన్‌ జత చేసింది.

ఇక సీఎస్‌కే ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా దర్జాగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ప్రస్తుతం సీఎస్‌కే 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నప్పటికి.. లక్నో కూడా 15 పాయింట్లతోనే ఉంది. 

చదవండి: ఏందీ క్రేజ్‌.. బంతులు వేయాలంటే భయపడుతున్నారు!


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)