Breaking News

క్యాచ్ ప‌ట్టాడు.. కోటీశ్వ‌రుడు అయ్యాడు! వీడియో వైర‌ల్‌

Published on Sun, 12/28/2025 - 12:41

క్రికెట్ మ్యాచ్‌కు చూసేందుకు స్టేడియం వెళ్లిన ఓ అభిమానిని అదృష్టం వరించింది. ఒక్క క్యాచ్‌తో  రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అవును మీరు విన్నది నిజమే. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 తొలి మ్యాచ్‌లో పరుగుల వరద పారింది.

ఎంఐ కేప్ టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్ నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగుల భారీ స్కోరు సాధించింది. డర్బన్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే (64) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కేన్ విలియమ్సన్ (40), మార్‌క్రమ్‌(35) రాణించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో ర్యాన్ రికెల్టన్ అద్భుతసెంచరీతో మెరిశాడు. మిగిత బ్యాటర్లను పెద్దగా సహకరం లభించనప్పటికి రికెల్టన్ మాత్రం విధ్వంసం సృష్టించాడు.

సూపర్ క్యాచ్‌..
ఈ క్రమంలో 13వ ఓవర్ వేసిన మఫాక బౌలింగ్‌లో నాలుగో బంతికి రికెల్టన్ భారీ సిక్సర్ బాదాడు. ఆ బంతి నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లగా అక్కడే ఉన్న ఓ అభిమాని ఒంటి చేత్తో అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో అతడు కోటీశ్వరుడయ్యాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ నిబంధనల ప్రకారం.. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఎవరైనా సిక్స్ కొట్టినప్పుడు 2 మిలియన్ రాండ్లు(భారత కరెన్సీలో రూ. 1.08 కోట్లు)  బహుమతిగా ఇవ్వనున్నారు. 

ఈ సీజన్‌లో ఈ భారీ నగదు బహుమతిని గెలుచుకున్న మొదటి వ్యక్తి అతడే. ఒకవేళ టోర్నమెంట్ మొత్తం మీద మరికొంతమంది కూడా ఇలాంటి క్యాచ్‌లు పడితే, ఈ 2 మిలియన్ రాండ్ల మొత్తాన్ని వారందరికీ సమానంగా పంచుతారు. కాగా ఈ మ్యాచ్‌లో ఎంఐ కేప్ టౌన్‌పై 15 పరుగుల తేడాతో డర్బన్ సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది.
చదవండి: IND vs NZ: రిష‌బ్ పంత్‌కు భారీ షాక్‌.. జ‌ట్టులోకి డ‌బుల్ సెంచ‌రీ వీరుడు!


 

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)