Breaking News

IPL: సంచలన నిర్ణయం తీసుకున్న 'డుప్లెసిస్'

Published on Sat, 11/29/2025 - 22:46

దక్షిణాఫ్రికా స్టార్‌ ప్లేయర్‌  డుప్లెసిస్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతూ సోషల్‌మీడియాలో ఒక లేఖను పంచుకున్నాడు.. ఇప్పటి వరకు 14 సీజన్లలో అద్భుతమైన ప్రదర్శన చేసిన డుప్లెసిస్‌  ఈ ఏడాది వేలంలో పాల్గొనట్లేదని తాజాగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే, పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)లో ఆడతానని తెలిపాడు. డుప్లెసిస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కెరీర్‌లో ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), పుణే(RPS),రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ జట్లకు  జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

డుప్లెసిస్ IPL కెరీర్‌లో 154 మ్యాచుల్లో 4,773 పరుగులు చేశాడు. 2021లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలవడంలో అతను కీలకపాత్ర పోషించాడు. అయితే, 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అతన్ని  కొనుగోలు చేసింది. ఆపై కెప్టెన్‌గా నియమించింది. 14 సీజన్ల తర్వాత  ఈ ఏడాదిలో జరిగే వేలంలో పాల్గొనడం లేదని తాజాగా  ఇలా ప్రకటించాడు.  'ఐపీఎల్‌ నా ప్రయాణంలో చాలా ముఖ్యమైన భాగం. ప్రపంచ స్థాయిలో పేరు పొందిన ఆటగాళ్లతో భాగమయ్యాను. చాలా గొప్ప ఫ్రాంఛైజీలతో బరిలోకి దిగాను. భారత్‌లో నాకు మంచి స్నేహితులు ఉన్నారు. ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. 

ఒక వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దిన జ్ఞాపకాలను ఐపీఎల్‌ నాకు ఇచ్చింది. నాకు అండగా ఉన్న  ప్రతి కోచ్‌తో పాటు సహాయక సిబ్బంది, అభిమానులకు ధన్యవాదాలు. 14 ఏళ్ల పాటు ఈ అధ్యాయాన్ని తలుచుకుంటుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నా హృదయంలో భారత్‌కు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. మనం తప్పకుండా మళ్లీ కలుస్తాం. ఇదీ వీడ్కొలు కాదు. ఈ ఏడాదిలో ఒక కొత్త సవాలును స్వీకరిస్తున్నాను.  రాబోయే పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) సీజన్‌లో ఆడబోతున్నాను.' అంటూ  డుప్లెసిస్‌ తన సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు.
 

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)