Breaking News

ఎక్సలెన్సియా అద్భుత విజయం.. Varsity ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ కైవసం

Published on Sun, 06/29/2025 - 17:52

సాక్షి, మొయినాబాద్: డెక్కన్ అరేనాలో జరిగిన 2025 Varsity ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో ఎక్సలెన్సియా జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గార్డియంను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాదాపు 1,000 మంది అభిమానుల కోలాహలం మధ్య జరిగిన ఈ మ్యాచ్ భారతదేశ పాఠశాల క్రీడల చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది.

ఆట ప్రారంభంలో గార్డియం ఆధిక్యత ప్రదర్శించినా, ఎక్సలెన్సియా పట్టుదలతో నిలబడి తొలి అర్ద భాగంలో గోల్స్ పడకుండా 0-0తో ముగించింది. సగం సమయం విరామంలో ఒక అద్భుతమైన వాతావరణం కనిపించింది. విద్యార్థుల బ్యాండ్ ప్రదర్శన, స్వచ్ఛంద సంస్థలు పెట్టిన ఆహార స్టాల్స్, ఉత్సాహంగా ఉన్న ప్రేక్షకుల సందడితో స్టేడియంలో పండుగ వాతావరణం నెలకొంది.

అనంతరం రెండో అర్ద భాగం 58వ నిమిషంలో నిమిష్ 30 అడుగుల యార్డ్ నుంచి కొట్టిన అద్భుతమైన షాట్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ఆ ఒక్క గోల్‌తో ఎక్సలెన్సియా 1-0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. చివరి విజిల్ మోగగానే ఎక్సలెన్సియా అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. మూడు నెలల క్రితం క్వాలిఫైయర్స్‌తో మొదలైన ఎక్సలెన్సియా ప్రస్థానం ఛాంపియన్‌షిన్‌ కైవసం చేసుకోవడంతో ముగిసింది.

మ్యాచ్ అనంతరం నిమిష్‌కు బ్యాలన్ డి'ఓర్(Ballon d’Or), గోల్డెన్ బూట్ అవార్డులు లభించాయి. అభిమానులు రాత్రంతా నిమిష్ పేరుతో విజయ నినాదాలు చేశారు. ఇది కేవలం ఒక చివరి ఆట మాత్రమే కాదు. Varsity అనే ఒక కొత్త క్రీడా ఉద్యమం ఆవిర్భావం అని చెప్పొచ్చు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)