Breaking News

పాకిస్తాన్‌ క్రికెట్‌కు భారీ షాక్‌.. దేశాన్ని వీడనున్న స్టార్‌ ఆటగాడు!?

Published on Sat, 01/20/2024 - 17:06

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌, వికెట్‌ ​కీపర్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్ అహ్మద్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌కు తన మ​కాం మార్చాలని సర్ఫరాజ్ అహ్మద్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టెస్టుల్లో పాక్‌ వికెట్‌ కీపర్‌గా కొనసాగుతున్న సర్ఫరాజ్‌ అహ్మద్‌కు.. మహ్మద్‌ రిజ్వాన్‌తో పాటు యువ వికెట్‌ కీపర్ల నుంచి తీవ్ర పోటీ ఎదురువుతోంది.

దీంతో అతడిని సెలక్టర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఒక వేళ సెలక్టర్లు ఎంపిక చేసినా.. తుది జట్టులో చోటు అంతంతమాత్రమే. తన క్రికెట్‌ భవిష్యత్తు సందిగ్ధంలో పడడంతో పాకిస్తాన్‌ను విడిచిపెట్టి లండన్‌ వెళ్లాలని సర్ఫరాజ్‌ అహ్మద్‌ నిర్ణయించుకున్నట్లు పాక్‌ మీడియా వర్గాలు వెల్లడించాయి.  

యూకేలో ఉంటూ కౌంటీలు, ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఆడాలని  సర్ఫరాజ్‌ ఫిక్స్‌ అయినట్లు సమాచారం. అయితే అహ్మద్‌ తన సొంత దేశాన్ని వదిలి యూకేకు వెళ్లినా త్వరలో పాకిస్తాన్‌లో జరగనున్న  పీఎస్‌ఎల్‌ లో మాత్రం ఆడతానని సర్ఫరాజ్‌ సృష్టం చేసినట్లు వినికిడి. ఇప్పటికే తన ప్రాతినిథ్యం వహిస్తున్న  క్వెట్టా గ్లాడియేటర్స్‌ ఫ్రాంచైజీకి సర్ఫరాజ్‌ ఈ విషయాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది.

అయితే దేశం విడిచి వెళ్లడంపై సర్ఫరాజ్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవలే  ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టులలో పాకిస్తాన్‌ తరపున సర్ఫరాజ్‌ ఆడాడు. తొలి టెస్టుకు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్న అహ్మద్‌.. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు.

దీంతో అతడిని రెండో టెస్టుకు జట్టు మేనెజ్‌మెంట్‌ పక్కన పెట్టేసింది. రెండో టెస్టుకు సర్ఫరాజ్‌ స్ధానంలో మహ్మద్‌ రిజ్వాన్‌ తుది జట్టులోకి వచ్చాడు. ఓవరాల్‌గా సర్ఫరాజ్‌ తన కెరీర్‌లో ఇప్పటివరకు 54 టెస్టులు, 117 వన్డేలు, 61 టీ20ల్లో పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. మూడు ఫార్మాట్లలో 6 సెంచరీలు, 35 హాఫ్‌ సెంచరీల సాయంతో 6,164 పరుగులు చేశాడు. కాగా 2017లో అతడి సారథ్యంలోనే ఛాంపియన్స్‌ ట్రోఫీని పాకిస్తాన్‌ సొంతం చేసుకుంది.
చదవండిSania Mirza: సానియా మీర్జాకు విడాకులు?.. నటిని పెళ్లాడిన షోయబ్‌ మాలిక్‌!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)