Breaking News

బీసీసీఐలోకి చేతన్‌ శర్మ.. మరోసారి సెలెక్టర్‌గా బాధ్యతలు

Published on Fri, 06/16/2023 - 13:48

భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్,   బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్  చేతన్ శర్మ  తిరిగి సెలక్షన్ బాధ్యతలను చేపట్టాడు. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ చేసిన  స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్‌ శర్మ అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే.  టీమిండియా ఫేక్ ఫిట్ నెస్ సీక్రెట్స్, ఆటగాళ్ల ఎంపిక, విశ్రాంతి పేరుతో ఆటగాళ్లను ఆటకూ దూరం చేసే అదృష్టశక్తులు, ఎవరిని డ్రాప్ చేయాలి, ఎవరికి ఛాన్స్ ఇవ్వాలని అనేది నిర్ణయించేది ఎవరు?

బిసీసీఐ చీఫ్ గా సౌరబ్ గంగూలీకి, విరాట్ కోహ్లీకి మధ్య జరిగిన ఘర్షణల గురించి.. విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మ మధ్య ఉన్న ఈగో క్లాషెస్ గురించి.. ఇలా చెప్పుకుంటూపోతే బిసిసిఐకి సంబంధించిన ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయి. దీంతో అతడు  బీసీసీఐ చీఫ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

చేతన్ స్వయంగా బీసీసీఐకి తన రాజీనామాను సమర్పించాడు. అప్పటి నుంచి నాలుగు నెలల పాటు ఎవరికి కనిపించని చేతన్‌ శర్మ కనీసం సోషల్‌ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేడు.అయితే తాజాగా మరోసారి సెలక్షన్‌ కమిటీలో బాధ్యతలు చేపట్టాడు. కానీ జాతీయ జట్టుకు చీఫ్  సెలక్టర్‌గా కాకుండా  నార్త్ జోన్ సెలక్షన్ కమిటీలో చైర్మెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు.  దులీప్ ట్రోఫీలో భాగంగా  నార్త్ జోన్ టీమ్ కు   సెలక్షన్ కమిటీలో చేతన్ శర్మ భాగమయ్యాడు.

దులీప్ ట్రోఫీలో భాగంగా  చేతన్ శర్మ సారథ్యంలోని  నార్త్ జోన్.. తమ జట్టుకు  మన్‌దీప్ సింగ్ ను సారథిగా ఎంపిక చేసింది.   ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున అదగరొట్టిన  పంజాబ్ ఓపెనర్  ప్రభ్‌సిమ్రన్ సింగ్ తో పాటు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ సంచలనం నెహల్ వధెరా లు కూడా నార్త్ జోన్ లో ఉన్నారు. కాగా  ఈ టీమ్ లో జయంత్ యాదవ్ ఒక్కడే క్యాప్డ్ ప్లేయర్ గా ఉన్నాడు.  

చదవండి: భార్య జెర్సీతో బరిలోకి.. తొలి మ్యాచ్‌లోనే ఉతికారేశాడు

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)