మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ..! క‌ట్ చేస్తే.. విధ్వంసకర సెంచరీ

Published on Sun, 10/27/2024 - 13:00

పల్లెకలె వేదికగా శ్రీలంకతో జరిగిన మూడు వన్డేలో 8 వికెట్ల తేడాతో(డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి) వెస్టిండీస్‌ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన వెస్డిండీస్‌ కెప్టెన్‌ షాయ్‌ హోప్‌ తొలుత శ్రీలంకను బ్యాటింగ్‌ ఆహ్హనించాడు. అయితే శ్రీలంక స్కోర్‌ 17.2 ఓవర్లలో 81-1 వద్ద వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది.

ఆ తర్వాత దాదాపు రెండు గంటల తర్వాత మ్యాచ్‌ మళ్లీ తిరిగి ప్రారంభమైంది. మ్యాచ్‌కు 23 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో మొదట ‍బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కుశాల్‌ మెండిస్‌(22 బంతుల్లో 56, 9 ఫోర్లు, ఒక సిక్సర్‌), నిస్సాంక(56) హాఫ్‌ సెంచరీలతో మెరిశారు.

అనంతరం డక్‌వర్త్‌లూయిస్‌ పద్దతి ప్రకారం విండీస్‌ టార్గెట్‌ను 23 ఓవర్లలో 195 పరుగులగా నిర్ణయించారు. ఈ భారీ లక్ష్యాన్ని విండీస్‌ సునాయసంగా ఛేదించేసింది. 22 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి కరేబియన్లు ఊదిపడేశారు.

లూయిస్‌ విధ్వంసకర సెంచరీ..
కాగా మూడేళ్ల తర్వాత విండీస్‌ వన్డే జట్టులోకి వచ్చిన ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కేవలం 61 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో లూయిస్‌ 102 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు సర్ఫెన్‌ రూథర్‌ ఫర్డ్‌(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) మెరుపు హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఇక ఈ ఓటమితో విండీస్‌ వైట్‌వాష్‌ నుంచి తప్పించుకుంది. అదేవిధంగా తొలి రెండు వన్డేల్లో విజయం సాధించిన శ్రీలంక 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)