Breaking News

వారానికి రూ. 5 కోట్లు.. జాక్‌పాట్‌ కాదు! అంతకు మించి..

Published on Fri, 01/17/2025 - 19:13

నార్వే ఫుట్‌బాల్‌ స్టార్‌ ఎర్లింగ్‌ హాలాండ్‌(Erling Haaland) జాక్‌పాట్‌ కొట్టేశాడు. ఊహకందని రీతిలో వారానికి రూ. 5 కోట్ల చొప్పున సంపాదించనున్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌ సిటీ(Manchester City) ఫుట్‌బాల్‌ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కాగా 2000 సంవత్సరంలో జన్మించిన హాలాండ్‌ నార్వే జాతీయ జట్టు తరఫున ఫుట్‌బాల్‌ ఆడుతున్నాడు.

రెండుసార్లు ‘గోల్డెన్‌ బూట్‌’
ఈ క్రమంలో ఇంగ్లండ్‌లో జరిగే ప్రీమియర్‌ లీగ్‌(Premier League)లో అడుగుపెట్టిన హాలాండ్‌.. అరంగేట్రంలోనే రికార్డులు బద్దలుకొట్టాడు. తొలి సీజన్‌లోనే 36 గోల్స్‌తో దుమ్ములేపాడు ఈ స్ట్రైకర్‌. ఇక గత సీజన్‌లో మాంచెస్టర్‌ తరఫున 27 గోల్స్‌ కొట్టిన అతడు.. రెండుసార్లు ‘గోల్డెన్‌ బూట్‌’ గెలిచాడు.

కానీ ఈ దఫా 16 గోల్స్‌తో సరిపెట్టాడు. ఇక గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. అతడు మాంచెస్టర్‌ సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో ఇంకో రెండేళ్లు మాత్రమే కొనసాగాల్సి ఉంది. కానీ తాజాగా ఈ డీల్‌ను పొడగిస్తూ మాంచెస్టర్‌ సిటీ నిర్ణయం తీసుకుంది. తొమ్మిదిన్నరేళ్ల పాటు హాలాండ్‌ను కొనసాగించనుంది.

కళ్లు చెదిరే మొత్తం
ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలోనే ఇది సుదీర్ఘకాలం పాటు సాగే ఒప్పందం. అంతేకాదు.. ఈ డీల్‌ ద్వారా హాలాండ్‌ వారానికి ఐదు లక్షల పౌండ్లు(భారత కరెన్సీలో దాదాపు ఐదున్నర కోట్లకు పైగా) ఆర్జించనున్నాడట. 

ఈ నేపథ్యంలో హాలాండ్‌ స్పందిస్తూ.. ‘‘నేను చాలా చాలా సంతోషంగా.. గర్వంగా ఉన్నాను. సిటీ క్లబ్‌తో సుదీర్ఘకాలం కొనసాగేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ ఒప్పందం గురించి సులువుగానే నిర్ణయానికి వచ్చేశాను.

ఇక ఆటపై నేను మరింత దృష్టి పెట్టగలను. ఒకే జట్టుతో ఎక్కువకాలం కలిసి ప్రయాణించడం సానుకూల ఫలితాలను ఇస్తుంది’’ అని పేర్కొన్నాడు. ఇక మాంచెస్టర్‌ సిటీ టీమ్‌ మేనేజర్‌(కోచ్‌) జోసెప్‌ గ్వార్డియోలా సలాతో కలిసి మరికొంతకాలం పనిచేయడం ద్వారా తన నైపుణ్యాలు మరింత మెరుగుపరచుకోవచ్చని హాలాండ్‌ హర్షం వ్యక్తం చేశాడు.

అలాంటి వ్యక్తిని చూడలేదు
‘‘నేను ఇప్పటికే చాలా మెరుగయ్యాను. అతడితో కలిసి పనిచేయడం చాలా బాగుంటుంది. అతడు కేవలం అత్యుత్తమ వ్యక్తి మాత్రమే కాదు.. హార్డ్‌వర్కర్‌ కూడా. అలాంటి వ్యక్తిని నేను ఇంతకు ముందు చూడనేలేదు’’ అని గ్వార్డియోలాపై హాలాండ్‌ ప్రశంసలు కురిపించాడు. 

కాగా స్పెయిన్‌కు చెందిన గ్వార్టియోలా మాంచెస్టర్‌ సిటీ క్లబ్‌కు 2016 నుంచి కోచ్‌గా ఉన్నాడు. వివిధ టోర్నీల్లో కలిపి మొత్తంగా 18 సార్లు ట్రోఫీ అందించాడు. ఇదిలా ఉంటే.. తాజా ఒప్పందం ప్రకారం ఎర్లిండ్‌ హాలాండ్‌ మాంచెస్టర్‌ సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో 2034 వరకు కొనసాగనున్నాడు.

చదవండి: CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్‌ చేయండి: సెహ్వాగ్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు