Breaking News

బ్రెజిల్‌కు గుండెకోత.. ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమణ

Published on Mon, 07/06/2026 - 07:21

ఆరో సారి ఫిఫా వరల్డ్‌కప్‌ గెలవాలనుకున్న మాజీ ఛాంపియన్‌ బ్రెజిల్‌ ఆశలు అడియాశలయ్యాయి. నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ బ్రెజిల్‌ ఆశలను అడియాశలు చేశాడు. 2026 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ జరిగిన ప్రీ క్వార్టర్‌ ఫైనల్లో బ్రెజిల్‌పై నార్వే 2-0 గోల్స్‌ తేడాతో గెలుపొంది, తొలిసారి క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ దెబ్బతో బ్రెజిల్‌ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.  క్వార్టర్ ఫైనల్లో నార్వే ఇంగ్లండ్‌ లేదా మెక్సికోతో తలపడుతుంది. 

ఒంటికాలితో తన్నేశాడు..!
బ్రెజిల్‌ ప్రపంచకప్‌ కలను హాలాండ్‌ ఒంటికాలితో తన్నేశాడు. మ్యాచ్‌ చివరి క్షణాల్లో (80, 90) లభించిన రెండు అవకాశాలను అద్భుతంగా సద్వినియోగం చేసుకుని రెండు గోల్స్ నమోదు చేశాడు. దీంతో బ్రెజిల్‌పై నార్వే చారిత్రక విజయం సాధించింది. బ్రెజిల్ ఆరో ప్రపంచకప్ కల చెదిరిపోయింది.

ఈ మ్యాచ్‌లో బ్రెజిల్‌ అటాకింగ్‌ కంటే డిఫెన్స్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చి మూల్యం చెల్లించుకుంది. మరోవైపు నార్వే దూకుడుగా ఆడి బ్రెజిల్‌ను చావుదెబ్బ కొట్టింది. ఆ జట్టు తరఫున హాలాండ్‌, మార్టిన్ ఓడెగార్డ్, పాట్రిక్ బెర్గ్, ఆండ్రియాస్ షెల్డెరప్ అద్భుతంగా ఆడారు. వరుసగా ప్రమాదకర దాడులు చేశారు.

78వ నిమిషానికి నార్వే 523 పాస్‌లు పూర్తి చేయగా, బ్రెజిల్ కేవలం 203 పాస్‌లతోనే సరిపెట్టుకోవడం మ్యాచ్‌పై నార్వే ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది.

బ్రెజిల్‌కు సైతం అవకాశాలు వచ్చినా..!
బ్రెజిల్‌కు సైతం మ్యాచ్‌లో పలు కీలక అవకాశాలు వచ్చినా వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది. బ్రునో గిమరాయెస్ కొట్టిన పెనాల్టీని గోల్‌కీపర్ ఓర్జన్ నైలాండ్ అద్భుతంగా అడ్డుకున్నాడు. గాబ్రియెల్ మార్టినెల్లి ప్రయత్నాన్ని కూడా నైలాండ్ నిలువరించాడు. ప్రత్యామ్నాయ ఆటగాడు ఎండ్రిక్‌కు వినీషియస్ జూనియర్ అందించిన చక్కని అవకాశాన్ని కూడా గోల్‌గా మార్చలేకపోయాడు. 68వ నిమిషంలో స్టార్‌ స్ట్రైకర్‌ నెయ్‌మార్ బరిలోకి దిగినా దాడుల్లో పెద్ద మార్పు రాలేదు. స్టాపేజ్ టైమ్‌లో (90+10) నెయ్‌మార్ పెనాల్టీ ద్వారా ఒక గోల్ చేసినా అప్పటికే ఆలస్యమైపోయింది.

80 నిమిషాలు నిశ్శబ్దం... చివరి 10 నిమిషాల్లో తుఫాన్
దాదాపు 80 నిమిషాల పాటు బ్రెజిల్ డిఫెండర్లు హాలాండ్‌ను సమర్థంగా కట్టడి చేశారు. కానీ 80వ నిమిషంలో షెల్డెరప్ ఇచ్చిన అద్భుతమైన క్రాస్‌ను హాలాండ్ హెడర్‌తో గోల్‌గా మలిచి నార్వేకు ఆధిక్యం అందించాడు. 90వ నిమిషంలో బ్రెజిల్ మొత్తం ముందుకు రావడంతో ఏర్పడిన ఖాళీలను చాకచక్యంగా ఉపయోగించుకున్న హాలాండ్, బాక్స్ వెలుపల నుంచి ఎడమ కాలితో కొట్టిన బుల్లెట్ షాట్‌ను గోల్‌గా మార్చి మ్యాచ్‌ను పూర్తిగా నార్వే వైపు తిప్పేశాడు.

నెయ్‌మార్ కన్నీళ్లు.. హాలాండ్ ఆనందభాష్పాలు
ఫైనల్ విజిల్ అనంతరం నెయ్‌మార్ మైదానంలోనే నిలబడి భావోద్వేగానికి గురయ్యాడు. ఇది అతని చివరి ప్రపంచకప్ మ్యాచ్ కావచ్చన్న నేపథ్యంలో ఆ దృశ్యం అభిమానులను కదిలించింది. మరోవైపు చారిత్రక విజయంతో హాలాండ్ మైదానంలోనే కుప్పకూలి ఆనందభాష్పాలు పెట్టుకున్నాడు. నార్వే అభిమానులు స్టేడియంలో చాలా సేపు సంబరాలు కొనసాగించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)