Breaking News

ఘోరంగా విఫలమైన వైభవ్‌ సూర్యవంశీ

Published on Wed, 07/23/2025 - 21:06

ఇంగ్లండ్‌ అండర్‌ 19 జట్టుతో జరుగుతున్న రెండో యూత్‌ టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత యువ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ ఘోరంగా విఫలమయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే అలెక్స్‌ గ్రీన్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డై గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కూడా వైభవ్‌ నిరాశపరిచాడు. కేవలం 20 పరుగులకే ఔటయ్యాడు.

ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో కూడా వైభవ్‌ ఓ మోస్తరు ప్రదర్శనలకే పరిమితమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులే చేసి నిరాశపరిచిన వైభవ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ద సెంచరీ చేసి పర్వాలేదనిపించాడు. టెస్ట్‌ సిరీస్‌లో వైభవ్‌పై భారీ అంచనాలు ఉండటానికి​ కారణం అంతకుముందు ఇంగ్లండ్‌తోనే జరిగిన ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌.  

ఆ సిరీస్‌లో వైభవ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి మ్యాచ్‌లో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిన వైభవ్‌.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు.. మూడో వన్డేలో 31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 86 పరుగులు.. నాలుగో వన్డేలో 78 బంతుల్లో 13 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో ఏకంగా 143 పరుగులు చేశాడు. చివరి  వన్డేలో శాంతించిన వైభవ్‌..  ఓ మోస్తరు ఇన్నింగ్స్‌తో (42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 33 పరుగులు) సరిపెట్టాడు.

వైభవ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ల ధాటికి భారత్‌ ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపై 3-2 తేడాతో ఓడించి సిరీస్‌ కైవసం చేసుకుంది. వైభవ్‌ వన్డేల్లో ప్రదర్శించిన జోరును కొనసాగిస్తాడని అనుకుంటే మమ అనిపించి నిరాశపరిచాడు.

టెస్ట్‌ సిరీస్‌ విషయానికొస్తే.. తొలి టెస్ట్‌ డ్రా కాగా.. రెండో టెస్ట్‌లో ఇవాళ (జులై 23) చివరి రోజు ఆట కొనసాగుతుంది. టీ విరామం సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. వైభవ్‌ గోల్డెన్‌ డకౌటై నిరాశపరిచినా కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే అజేయ అర్ద సెంచరీతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా అభిగ్యాన్‌ కుందు (19) క్రీజ్‌లో ఉన్నాడు.

ఈ మ్యాచ్‌లో భారత్‌ 355 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవాలంటే మరో 223 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి.

స్కోర్‌ వివరాలు..

  • ఇంగ్లండ్‌ అండర్‌-19: 309 (ఎకాన్ష్‌ సింగ్‌ 117) & 324/5 (డాకిన్స్‌ 136)

  • భారత్‌ అండర్‌-19: 279 (విహాన్‌ మల్హోత్రా 120) & 131/2 (ఆయుశ్‌ మాత్రే 80 నాటౌట్‌)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)