Breaking News

ఇంగ్లండ్‌ జయభేరి

Published on Sun, 10/06/2024 - 04:14

షార్జా: ఇంగ్లండ్‌ స్థాయికి సరితూగని బంగ్లాదేశ్‌ బౌలింగ్‌లో మెరిసింది. కలిసొచ్చిన పిచ్‌పై మాజీ చాంపియన్‌ను ముప్పుతిప్పలు పెట్టింది. కానీ రెండాకులు ఎక్కువే తిన్న ఇంగ్లండ్‌ బౌలర్లు బౌలింగ్‌కు అనుకూలించే వికెట్‌పై నిప్పులు చెరగడంతో మహిళల టి20 ప్రపంచకప్‌ను ఇంగ్లండ్‌ జట్టు విజయంతో ఆరంభించింది. 

గ్రూప్‌ ‘బి’లో శనివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్ల 7 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 97 పరుగులే చేయగలిగింది.  

ఆరంభం అదిరినా... 
‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డానీ వ్యాట్‌ (40 బంతుల్లో 41; 5 ఫోర్లు), మయా బౌచర్‌ (18 బంతుల్లో 23; 3 ఫోర్లు) మంచి ఆరంభమే ఇచ్చారు. 48 పరుగుల వద్ద బౌచర్‌ అవుట్‌ కావడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ గతి తప్పింది. మరో ఓపెనర్‌ డానీ వ్యాట్‌ మినహా నట్‌ సీవర్‌ బ్రంట్‌ (2), కెప్టెన్‌ హీథెర్‌ నైట్‌ (6), అలైస్‌ క్యాప్సీ (9)లను స్వల్ప వ్యవధిలో బోల్తా కొట్టించిన బంగ్లా బౌలర్లు ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెట్టారు. ఓపెనర్ల తర్వాత ఎమీ జోన్స్‌ (12 నాటౌట్‌) ఒక్కరిదే రెండంకెల స్కోరు!  

శోభన పోరాడినా... 
బంగ్లా ముందున్న లక్ష్యం చిన్నదే. కానీ ప్రత్యర్థి కష్టమైంది. బౌలింగ్‌ క్లిష్టమైంది. దీంతో బంగ్లా బ్యాటర్ల ఆటలేమి సాగలేదు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ శోభన మోస్తరి (48 బంతుల్లో 44; 1 ఫోర్, 1 సిక్స్‌) ఒంటరి పోరాటం చేసింది. 

కెప్టెన్  నిగార్‌ సుల్తానా (15) కూడా ప్రభావం చూపకపోగా, ఇతర బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఆరంభం నుంచే వికెట్లు కోల్పోవడంతో ఓవర్లు గడుస్తున్న కొద్దీ బంగ్లా లక్ష్యానికి దూరమైంది. లిన్సే స్మిత్‌ (2/11), చార్లీ డీన్‌ (2/22) ప్రత్యరి్థని దెబ్బ తీశారు. 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)