Breaking News

ఇంగ్లండ్‌... తగ్గేదేలే

Published on Tue, 07/29/2025 - 06:35

బాసెల్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌ మహిళల జట్టు యూరో ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో టైటిల్‌ నిలబెట్టుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన హోరాహోరీ తుది పోరులో ఇంగ్లండ్‌ జట్టు పెనాల్టీ షూటౌట్‌లో 3–1తో స్పెయిన్‌పై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఆఖరి క్షణం దాకా  పోటా
పోటీగా పోరాడిన స్పెయిన్‌ పెనాల్టీ షూటౌట్‌లో అనూహ్యంగా చిత్తయ్యింది. కేవలం ఒకే ఒక్క స్ట్రయికర్‌ గోల్‌ చేయడం గమనార్హం.

 మరోవైపు ఇంగ్లండ్‌ బృందంలో ఇద్దరు బంతిని లక్ష్యాన్ని చేర్చడంలో విఫలమవగా... ముగ్గురు గోల్స్‌ చేశారు. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి ఇంగ్లండ్, స్పెయిన్‌ జట్లు 1–1 స్కోరుతో సమఉజ్జీలుగా నిలిచాయి. ముందుగా స్పెయిన్‌ శిబిరం నుంచి గోల్‌ నమోదైంది. తొలి అర్ధభాగంలోనే మరియాన కాల్డెంటే (25వ నిమిషంలో) గోల్‌ చేసి జట్టుకు శుభారంభాన్నిచి్చంది. 1–0తో ఆధిక్యంతోనే ప్రథమార్ధాన్ని ముగించింది. ద్వితీయార్ధం మొదలవగానే ఇంగ్లండ్‌ ప్లేయర్లు దాడులకు పదును పెట్టారు.

 ఈ క్రమంలో అలెసియా రుసో (57వ నిమిషంలో) గోల్‌ చేసి స్కోరును 1–1తో సమం చేసింది. తర్వాత ఇరుజట్ల ప్లేయర్లు ఎంతగా శ్రమించిన ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు. నిరీ్ణత సమయంలో ఫలితం తేలకపోవడంతో  అదనపు సమయం ఆడించారు. అయినా... స్కోరులో ఏ మార్పు లేకపోవడంతో పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది. ఇక్కడ తొలి షాట్‌ నుంచే ‘డ్రా’ మొదలైంది. స్పెయిన్‌ ఒకటే గోల్‌ చేసినా... ఇంగ్లండ్‌ గెలిచేందుకు ఆఖరి షాట్‌ గోల్‌దాకా వేచిచూడక తప్పలేదు. ఎందుకంటే మొదట కిక్‌ మొదలుపెట్టిన ఇంగ్లండ్‌ జట్టులో బెత్‌ మీడ్‌ విఫలమైంది. 

స్పెయిన్‌ తరఫున ప్యాట్రిసియా గూజారో గోల్‌ కొట్టడంతో నిరీ్ణత సమయం మ్యాచ్‌లోలానే 1–0తో ‘షూటౌట్‌’లోనూ తొలుత పైచేయి సాధించింది. అయితే ఇంగ్లండ్‌ ప్లేయర్లు అలెక్స్‌ గ్రీన్‌వుడ్, నియామి చార్లెస్‌లు వరుసగా షాట్లు కొట్టడంతో రేసులో పడగా... మరోవైపు  స్పెయిన్‌ శిబిరంలో మరియానా, ఐతాన బొన్‌మటి విఫలమవడంతో ఇంగ్లండ్‌ అనూహ్యంగా 2–1తో ఆధిక్యంలోకి దూసుకొచి్చంది. నాలుగో షాట్‌ లియా విలియమ్సన్‌ (ఇంగ్లండ్‌), సాల్మ పారాల్యులో (స్పెయిన్‌) ఎవరి వల్లా కాలేదు. 2–1తో ఇక ఆఖరి ప్రయత్నానికి సిద్ధమయ్యారు. ఒకవేళ ఇంగ్లండ్‌ ఐదో షాట్‌ విఫలమై, స్పెయిన్‌ చేసి ఉంటే 2–2తో సమమై విజేత కోసం డ్రామా కొనసాగేది. కానీ క్లో కెల్లీ (ఇంగ్లండ్‌) స్పెయిన్‌కు ఆ ఆఖరి ఛాన్స్‌ ఇవ్వకుండా గోల్‌ చేసింది. 3–1తో ఫలితం రావడంతో స్పెయిన్‌ ఆఖరి షాట్‌ తీసుకోలేదు. 2022లో జరిగిన అమ్మాయిల యూరోలోనూ ఇంగ్లండే చాంపియన్‌గా నిలిచింది. 

స్టేడియానికి ‘రాయల్‌’ కళ
సెయింట్‌ జాకబ్‌ పార్క్‌లో జరిగిన ఈ టైటిల్‌ పోరుకు ‘రాయల్‌’ హాజరు లభించింది. తుదిపోరును ప్రత్యక్షంగా తిలకించేందుకు బ్రిటన్‌ యువరాజు విలియమ్స్‌ (కింగ్‌ చార్లెస్‌ తనయుడు) కుమార్తె ప్రిన్సెస్‌ చార్లట్‌తో విచ్చేశారు. ప్రిన్స్‌ విలియమ్స్‌ ఇంగ్లిష్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు స్పెయిన్‌ రాజవంశానికి చెందిన యువరాణి ప్రిన్సెస్‌ లియోనర్‌ తన సోదరి ఇన్‌ఫాంటా సోఫియాతో కలిసి టైటిల్‌ పోరును వీక్షించింది. సోఫియా 2023లో సిడ్నీలో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌ను తల్లి, స్పెయిన్‌ రాణి లెటిజియాతో కలిసి వీక్షించింది. ఆ మ్యాచ్‌లో స్పెయిన్‌ విజేతగా నిలిచింది. మొత్తానికి 2023 ప్రపంచకప్, 2024 యూఈఎఫ్‌ఏ నేషన్స్‌ లీగ్‌ టైటిళ్లతో జోరుమీదున్న స్పెయిన్‌ వరుసగా మూడో ఏడాది ప్రతిష్టాత్మక టైటిల్‌ గెలవాలనే గంపెడాశలతో బరిలోకి దిగింది. కానీ తుదిమెట్టుపై చతికిలబడింది. దీంతో ‘యూరో’ కప్‌ స్పెయిన్‌ మహిళల జట్టుకు ఇన్నేళ్లయినా అందని ద్రాక్షగానే ఉంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)