రూట్ '164' నాటౌట్‌.. విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌

Published on Mon, 06/02/2025 - 08:49

కార్డిఫ్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన రెండో వన్డేలో 3 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజ‌యం సాధించింది. . తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2–0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 47.4 ఓవర్లలో 308 పరుగులకు ఆలౌటైంది.

కేసీ కార్టీ (105 బంతుల్లో 103; 13 ఫోర్లు) శతకంతో చెలరేగగా... కెప్టెన్‌ షై హోప్‌ (66 బంతుల్లో 78; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) బ్రాండన్‌ కింగ్‌ (59; 10 ఫోర్లు) హాఫ్‌సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆదిల్‌ రషీద్‌ 4, సాఖిబ్‌ మహమూద్‌ మూడు వికెట్లు తీశారు.

రూట్ సూప‌ర్ సెంచ‌రీ..
అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌ 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో జో రూట్ భారీ శ‌త‌కంతో చెల‌రేగాడు. 139 బంతులు ఎదుర్కొన్న రూట్‌.. 21 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 166 ప‌రుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఓ వైపు క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్లు ప‌డ‌తున్న‌ప్ప‌టికి రూట్ మాత్రం ఆచితూచి ఆడుతూ త‌న జ‌ట్టును విజ‌యతీరాల‌కు చేర్చాడు. 

రూట్‌తో పాటు కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ (47; 7 ఫోర్లు, 1 సిక్స్‌), విల్‌ జాక్స్‌ (49; 2 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడ‌రు. జెమీ స్మిత్‌ (0), బెన్‌ డకెట్‌ (0), జోస్‌ బట్లర్‌ (0) డకౌటయ్యారు. కాగా రూట్‌కు ఇది 18వ వ‌న్డే సెంచ‌రీ. ఈ క్రమంలో వన్డేల్లో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా జో రూట్‌ (179 మ్యాచ్‌ల్లో 7082 పరుగులు) అవతరించాడు.

 ఇయాన్‌ మోర్గాన్‌ (6957 పరుగులు) పేరిట ఉన్న రికార్డును రూట్‌ అధిగమించాడు. వెస్టిండీస్‌ బౌలర్లలో అల్జారీ జోసెఫ్‌ 4 వికెట్లు తీశాడు. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే మంగళవారం జరగనుంది.    

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)