Breaking News

22 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌తో టెస్టు.. ఓట‌మి దిశ‌గా జింబాబ్వే

Published on Sat, 05/24/2025 - 13:04

ఇంగ్లండ్‌తో 22 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న జింబాబ్వే జట్టుకు ఓటమి తప్పేలా లేదు. నాటింగ్‌హామ్‌ వేదికగా జరుగుతున్న నాలుగు రోజుల ఈ ఏకైక టెస్టులో రెండో రోజు కూడా ఇంగ్లండ్‌దే పైచేయిగా నిలిచింది. ఓవర్‌నైట్‌ స్కోరు 498/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ 96.3 ఓవర్లలో 6 వికెట్లకు 565 పరుగులవద్ద డిక్లేర్‌ చేసింది. 

తన ఓవర్‌నైట్‌ స్కోరుకు మరో రెండు పరుగులు జోడించి ఓలీ పోప్‌ (166 బంతుల్లో 171; 24 ఫోర్లు, 2 సిక్స్‌లు) అవుటయ్యాడు. హ్యారీ బ్రూక్‌ (50 బంతుల్లో 58; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని 3 వికెట్లు తీయగా... చివాంగ, సికందర్‌ రజా, మధెవెరెలకు ఒక్కో వికెట్‌ లభించింది.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జింబాబ్వే జట్టు 63.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ బ్రియాన్‌ బెనెట్‌ (143 బంతుల్లో 139; 26 ఫోర్లు) వీరోచిత సెంచరీ చేశాడు. కెపె్టన్‌ క్రెయిగ్‌ ఇరి్వన్‌ (64 బంతుల్లో 42; 6 ఫోర్లు), సీన్‌ విలియమ్స్‌ (41 బంతుల్లో 25; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. 

ఇంగ్లండ్‌ బౌలర్లలో స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ 3 వికెట్లు తీయగా... అట్కిన్‌సన్, బెన్‌ స్టోక్స్‌లకు రెండు వికెట్ల చొప్పున లభించాయి. స్యామ్‌ కుక్, జోష్‌ టంగ్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. 300 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించిన ఇంగ్లండ్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించకుండా జింబాబ్వేకు ఫాలోఆన్ ఇచ్చింది. 

ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన జింబాబ్వే రెండో రోజు ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్‌ ఓటమి తప్పించుకోవాలంటే మరో 270 పరుగులు చేయాలి.   

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)