తొలి విజయం దక్కేనా!

Published on Tue, 07/07/2026 - 06:02

నాటింగ్‌హామ్‌: టి20 ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత జట్టు మళ్లీ గెలుపు రుచి చూడలేకపోతోంది. ఐర్లాండ్‌ చేతిలో రెండు మ్యాచ్‌లలో ఓడి సిరీస్‌ కోల్పోయిన తర్వాత ఇంగ్లండ్‌తో గత మ్యాచ్‌లో పరాజయం పాలైంది. శ్రేయస్‌ అయ్యర్‌ ఇంకా కెప్టెన్‌గా గెలుపు ఖాతా తెరవలేదు. ఈ నేపథ్యంలో మరో పోరుకు భారత్‌ సిద్ధమైంది. నేడు ఇంగ్లండ్‌తో జరిగే మూడో టి20లోనైనా పైచేయి సాధించి ఈ టూర్‌లో తొలి విజయాన్ని అందుకోవాలని టీమిండియా భావిస్తోంది. భారత బ్యాటింగ్‌కు సంబంధించి మరోసారి అభిõÙక్‌ శర్మ ఇచ్చే ఆరంభం కీలకం కానుంది. అరంగేట్రంపై చర్చ ముగిసింది కాబట్టి ఇక వైభవ్‌ సూర్యవంశీ నుంచి అంచనాలకు తగినట్లుగా భారత్‌ ఒక చక్కటి ఇన్నింగ్స్‌ను ఆశిస్తోంది. ఇషాన్‌ కిషన్‌ తన వైఫల్యాల నుంచి బయటకు రావాల్సి ఉండగా... మిడిలార్డర్‌లో అయ్యర్, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే చెలరేగడం అవసరం. 

ముఖ్యంగా కెపె్టన్‌ అయ్యర్‌ ఇంకా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. బౌలింగ్‌ విషయంలో ఒక మార్పు ఖాయమైంది. గత మ్యాచ్‌లో చెత్త ప్రదర్శనలో భారత్‌ ఓటమికి కారణంగా నిలిచిన లెగ్‌స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ స్థానంలో మరో పేసర్‌కు అవకాశం ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌ నిర్ణయించింది. కాబట్టి ప్రిన్స్‌ యాదవ్‌ తుది జట్టులో రావచ్చు. అర్‌‡్షదీప్‌ విఫలమైనా.. మరో తగిన ప్రత్యామ్నాయం జట్టుకు లేదు. 

స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, అక్షర్‌ పటేల్‌ పరిస్థితిని బట్టి ప్రభావం చూపించగలరు. ఇంగ్లండ్‌ మాత్రం గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌లో ఎలాంటి మార్పూ చేయకుండా ఇప్పటికే తమ తుది జట్టును ప్రకటించింది. బ్యాటింగ్‌ భారం ప్రధానంగా కెపె్టన్‌ బ్రూక్, బెతెల్‌లపై ఉంది. రెండో టి20లో బెతెల్‌ జోరు చూస్తే అతడిని నిలువరించడం అంత సులువు కాదని అర్థమవుతోంది. అయితే గత పోరులో డకౌటైన ఓపెనర్లు సాల్ట్, బట్లర్‌ ఈ సారి ఎలాంటి ప్రభావితం చూపిస్తారనేది ఆసక్తికరం.

ఆ తర్వాత కూడా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో బాంటన్, జాక్స్, స్యామ్‌ కరన్‌లతో టీమ్‌ పటిష్టంగా కనిపిస్తోంది. ప్రధాన పేసర్లు ఆర్చర్, టంగ్‌ భారత్‌ను ఎంత వరకు నిలువరిస్తారనేదానిపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ట్రెంట్‌బ్రిడ్జ్‌ మైదానం అటు బ్యాటింగ్‌కు, ఇటు బౌలింగ్‌లో సమంగా సహకరిస్తుంది. గత కొంత కాలంగా ఇక్కడి పిచ్‌పై భారీ స్కోర్లు నమోదు కాలేదు. మ్యాచ్‌ రోజున ఎలాంటి వర్షసూచన లేదు.

#

Tags : 1

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)