Breaking News

Ashes: ‘బజ్‌బాల్‌’తో బొక్కబోర్లా.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌.. సిరీస్‌ మొత్తానికి..

Published on Tue, 07/04/2023 - 18:18

Ashes Series 2023: ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియా చేతిలో రెండు మ్యాచ్‌లలో స్టోక్స్‌ బృందం చిత్తైన విషయం తెలిసిందే. తద్వారా 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో వెనుబడింది. బజ్‌బాల్‌ అంటూ దూకుడు ప్రదర్శించి స్వదేశంలో తొలి రెండు మ్యాచ్‌లలో బోల్తా పడిన ఇంగ్లండ్‌కు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఆ జట్టు కీలక ఆటగాడు గాయపడ్డాడు.


ఓలీ పోప్‌

దీంతో మిగిలిన మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడు మరెవరో కాదు.. ఇంగ్లండ్‌ వైస్‌ కెప్టెన్‌ ఓలీ పోప్‌. కుడి భుజం నొప్పి కారణంగా అతడు జట్టుకు దూరమైనట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఆసీస్‌తో రెండో టెస్టు సందర్భంగా గాయపడ్డ అతడు మిగిలిన మ్యాచ్‌లలో అందుబాటులో ఉండడని పేర్కొంది.

ఈ మేరకు.. ‘‘లండన్‌లో స్కానింగ్‌ చేయించగా.. అతడి గాయం మరింత తీవ్రతరమైందని తేలింది. సర్జరీ చేయించుకోవాల్సి ఉంది. కాబట్టి మిగిలిన మ్యాచ్‌లకు అతడు దూరం కానున్నాడు’’ అని ఈసీబీ తన ప్రకటనలో పేర్కొంది. తమ వైద్య బృందం పర్యవేక్షణలో ఓలీ పోప్‌ చికిత్స పొందుతాడని వెల్లడించింది.

కాగా ఆసీస్‌తో తొలి రెండు మ్యాచ్‌లలో ఓలీ పోప్‌.. ఓ మోస్తరుగా రాణించాడు. మొదటి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 31, 14 పరుగులు చేసిన వన్‌డౌన్‌ బ్యాటర్‌.. రెండో టెస్టులో 42, 3 పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. రెండో టెస్టు సందర్భంగా ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో అవుటైన తీరు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాల ప్రధానులు సైతం పరస్పర విమర్శలతో తమ జట్లకు అండగా నిలవడం విశేషం.

చదవండి: 'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి'

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)