Breaking News

సౌతాఫ్రికా-ఇంగ్లండ్‌ మూడో టీ20 రద్దు.. సిరీస్‌ సమం

Published on Mon, 09/15/2025 - 13:48

ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాల మధ్య మూడు టీ20ల సిరీస్‌ 1–1తో సమంగా ముగిసింది. నాటింగ్‌హామ్‌ వేదిగా ఆదివారం జరగాల్సిన నిర్ణాయక ఆఖరి పోరు వర్షంతో రద్దయ్యింది. తెరిపినివ్వని వాన వల్ల మ్యాచ్‌కు అవకాశమే లేకపోయింది. 

కనీసం టాస్‌ కూడా వేయలేదు. మైదానమంతా చిత్తడిగా మారడంతో చేసేదేమీ లేక ఫీల్డ్‌ అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సిరీస్‌లో భాగంగా కార్డిఫ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో పర్యాటక దక్షిణాఫ్రికా గెలిచింది. 

ఈ మ్యాచ్‌కూ వరుణుడు అంతరాయం కలిగించగా సఫారీ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 14 పరుగులతో గెలిచింది. మాంచెస్టర్‌లో జరిగిన రెండో టి20లో ఇంగ్లండ్‌ ఏకంగా 146 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది.

ఈ రెండో టీ20లో ఇంగ్లండ్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. మొదట బ్యాటింగ్ చేసిప ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 60 బంతులు మాత్రమే ఎదుర్కొన్న  సాల్ట్ 15 ఫోర్లు, 8 సిక్సర్లతో 141 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

అతడితో పాటు జోస్ బట్లర్  30 బంతుల్లో ఏకంగా 83 పరుగులతో తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం లక్ష్య చేధనలో సౌతాఫ్రికా  16.1 ఓవర్లలోనే 158 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో సఫారీలు సొంతం చేసుకున్నారు.
చదవండి: చ‌రిత్ర సృష్టించిన కుల్దీప్ యాదవ్‌.. పాక్ ఆటగాడి రికార్డు బ్రేక్‌

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)