Breaking News

ఆసీస్‌తో తొలి టీ20.. ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన.. ముగ్గురి అరంగేట్రం

Published on Tue, 09/10/2024 - 18:20

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో రేపు (సెప్టెంబర్‌ 11) జరుగబోయే తొలి మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్‌ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ మ్యాచ్‌తో ముగ్గురు ఇంగ్లండ్‌ ఆటగాళ్లు (జేకబ్‌ బేథెల్‌, జేమీ ఓవర్టన్‌, జోర్డన్‌ కాక్స్‌) టీ20 అరంగేట్రం చేయనున్నారు. 

రెగ్యులర్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ గాయం కారణంగా ఈ సిరీస్‌ మొత్తానికి దూరం కావడంతో ఫిల్‌ సాల్ట్‌ ఇంగ్లండ్‌ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సౌతాంప్టన్‌ వేదికగా రేపటి మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది.

ఆసీస్‌తో తొలి టీ20 కోసం ఇంగ్లండ్‌ తుది జట్లు: ఫిల్ సాల్ట్ (కెప్టెన్‌), విల్ జాక్స్, జోర్డన్ కాక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బెథెల్, సామ్ కర్రన్, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, రీస్ టాప్లే

కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ అనంతరం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ జరుగనుంది.

ఆసీస్‌, ఇంగ్లండ్‌ మధ్య టీ20, వన్డే సిరీస్‌ షెడ్యూల్‌..

సెప్టెంబర్‌ 11- తొలి టీ20 (సౌతాంప్టన్‌)
సెప్టెంబర్‌ 13- రెండో టీ20 (కార్డిఫ్‌)
సెప్టెంబర్‌ 15- మూడో టీ20 (మాంచెస్టర్‌)

సెప్టెంబర్‌ 19- తొలి వన్డే (నాటింగ్హమ్‌)
సెప్టెంబర్‌ 21- రెండో వన్డే (లీడ్స్‌)
సెప్టెంబర్‌ 24- చెస్టర్‌ లీ స్ట్రీట్‌
సెప్టెంబర్‌ 27- లండన్‌
సెప్టెంబర్‌ 29- బ్రిస్టల్‌

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)