Ashes 4th Test: క్రికెట్‌ చరిత్రలో కేవలం రెండో జట్టుగా టీమ్‌ ఇంగ్లండ్‌

Published on Thu, 07/20/2023 - 17:48

యాషెస్‌ సిరీస్‌ నాలుగో టెస్ట్‌ ఆడుతున్న ఇంగ్లండ్‌ జట్టు ఓ అరుదైన గుర్తింపు దక్కించుకుంది. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఏ దేశానికి చెందిన జట్టు సాధించని ఓ రికార్డును టీమ్‌ ఇంగ్లండ్‌ సాధించింది. ఓవరాల్‌గా టెస్ట్‌ క్రికెట్‌లో ఆ ఘనత సాధించిన రెండో జట్టుగా రికార్డుల్లోకెక్కింది. 

ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే.. యాషెస్‌ నాలుగో టెస్ట్‌కు ముందు టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో కేవలం ఒకే ఒక్క జట్టులో మాత్రమే కనీసం 10 మంది ఆటగాళ్లు 1000 పరుగులు చేశారు. ఆ జట్టు కూడా ఏ దేశానికి చెందినది కాదు. 2005లో ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్‌ టెస్ట్‌లో ఐసీసీ వరల్డ్‌ ఎలెవెన్‌ జట్టు ఈ ఘనత సాధించింది.

ఆ మ్యాచ్‌లో వరల్డ్‌ ఎలెవెన్‌లోని 10 మంది ఆటగాళ్లు కనీసం 1000 పరుగుల మార్కును దాటారు. నాటి జట్టులో స్టీవ్‌ హార్మిసన్‌ (743) మినహా అందరూ 1000 పరుగులు దాటిన వారు ఉన్నారు. అందులో ముగ్గురు తమతమ కెరీర్‌లు ముగిసే నాటికి ఏకంగా 11000 పరుగుల మార్కును దాటారు.

ఆ తర్వాత ఇనాళ్లకు (18 ఏళ్ల తర్వాత) తిరిగి మరో జట్టులో కనీసం​ 10 మంది ఆటగాళ్లు 1000 పరుగుల మార్కును దాటిన వారు ఉన్నారు. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ తుది జట్టులోని మార్క్‌ వుడ్‌ (681) మినహా మిగతా 10 మంది ఆటగాళ్లు 1000 పరుగుల మార్కును దాటారు. ఇక్కడ మరో విశేషమేమింటంటే.. నాటి ప్రత్యర్ధి, నేటి ప్రత్యర్ధి  రెండూ ఆస్ట్రేలియానే. 

యాషెస్‌ నాలుగో టెస్ట్‌ ఆడుతున్న ఇంగ్లండ్‌ జట్టు..
జాక్‌ క్రాలే (1920), బెన్‌ డకెట్‌ (1037), మొయిన్‌ అలీ (2977), జో రూట్‌ (11236), హ్యారీ బ్రూక్‌ (1028), జానీ బెయిర్‌స్టో (5623), క్రిస్‌ వోక్స్‌ (1717), మార్క్‌ వుడ్‌ (681), స్టువర్ట్‌ బ్రాడ్‌ (3641), జేమ్స్‌ ఆండర్సన్‌ (1327).

2005లో ఆస్ట్రేలియాతో ఆడిన వరల్డ్‌ ఎలెవెన్‌ జట్టు (ఆటగాళ్ల కెరీర్‌లు ముగిసిన నాటి స్కోర్లు)..
గ్రేమ్‌ స్మిత్‌ (9265), వీరేంద్ర సెహ్వాగ్‌ (8586), రాహుల్‌ ద్రవిడ్‌ (13288), బ్రియాన్‌ లారా (11953), జాక్‌ కలిస్‌ (13289), ఇంజమామ్‌ ఉల్‌ హాక్‌ (8830), ఆండ్రూ ఫ్లింటాఫ్‌ (3845), మార్క్‌ బౌచర్‌ (5515), డేనియల్‌ వెటోరీ (4531), స్టీవ్‌ హార్మిసన్‌ (743), ముత్తయ్య మురళీథరన్‌ (1261). 

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)